ప‌వ‌న్ రియాక్ష‌న్ వెన‌క కార‌ణ‌మేంటి..?


రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత క‌చ్చితంగా విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని తెలుసు. కానీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు మాత్రం ప‌వ‌న్ పై ఒక్క‌రు కూడా నోరు విప్ప‌లేదు. క‌నీసం ఆ ధైర్యం కూడా చేయ‌లేదు. కానీ ఉన్న‌ట్టుండి కొన్ని రోజులుగా ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు జరుగుతున్నాయి. ప్ర‌తీ ఇష్యూలో కూడా ప‌వ‌న్ ను మ‌ధ్య‌లోకి లాగ‌డం..
ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాగ‌డం కొంద‌రికి కామ‌న్ అయిపోయింది. ఆ మ‌ధ్య క‌త్తిమ‌హేశ్.. ఇప్పుడు శ్రీ‌రెడ్డి.. ఎప్పుడు ప‌డితే అప్పుడు వ‌ర్మ‌.. ఇలా ఎవ‌రికి వాళ్లు ప‌వ‌న్ ను వాడుకున్నారు. కానీ ఇన్ని రోజులు చూస్తూ కూర్చున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు ఒక్క‌సారిగా రియాక్ట్ అయ్యాడు. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అర్ధ‌రాత్రి సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు.
టివి 9.. టివి 4.. ఏబిఎన్ తో పాటు మ‌రి కొంద‌రు పేర్లు కూడా బ‌య‌ట‌పెడుతూ అంతా త‌న‌పై కుట్ర ప‌న్నుతున్నార‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్.
ఇక రాజ‌కీయంగా కూడా చంద్ర‌బాబునాయుడుతో పాటు అత‌డి త‌న‌యుడు లోకేష్ పై కూడా విమ‌ర్శ‌లు చేసాడు ప‌వ‌ర్ స్టార్. ఉన్న‌ట్లుండి ప‌వన్ ఇలా రివ‌ర్స్ అవ్వ‌డం మాత్రం నిజంగా అంద‌రికీ షాకే. ఎందుకంటే ఏం జ‌రిగినా.. ఎంత జ‌రిగినా కూడా మ‌నం బ‌ల‌వంతులం భ‌రిద్దాం అంటూ చెప్తుంటాడు ప‌వ‌న్.
త‌ల్లిని తిట్టేస‌రికి జీర్ణించుకోలేక‌పోయాడు ప‌వ‌ర్ స్టార్. అందుకే ఇప్పుడు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అంద‌రి భ‌ర‌తం ప‌డ‌తానంటూ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో చిందేసాడు. ఉన్న‌ట్లుండి ప‌వ‌న్ ఇలా రియాక్ట్ అవ్వ‌డంతో పొలిటిక‌ల్ గా కూడా సంచ‌ల‌నం రేగింది. ఇప్ప‌టితో ఇది ఆగేలా కూడా క‌నిపించ‌ట్లేదు. ఇన్నాళ్లూ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు ఎవ‌రూ ఎందుకు స‌మాధానం చెప్ప‌డం లేద‌ని నిల‌దీసాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి ఈయ‌న తీరు చూస్తుంటే క‌చ్చితంగా ఈ ఇష్యూ ఇక్క‌డితో ముగిసేలా అయితే క‌నిపించ‌ట్లేదు.. ఇంకా ఇక్క‌డితోనే ఆరంభం అని కూడా అనిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here