ప‌వ‌న్ వాళ్ల మాట విన‌డం లేదా..? 

   I-WANT-TO-THANK-PAWAN-KALYAN--#RGV
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అంటే ఎప్పుడు మొద‌లై.. ఎప్ప‌టికి పూర్త‌వుతుందో తెలియ‌ని ఓ ఫ‌జిల్. ఇన్నాళ్లూ సినిమా ఒప్పుకుంటే ఏదో ఓ టైమ్ లో చేస్తాడులే అనే న‌మ్మ‌కం అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా నిర్మాత‌ల్లో క‌నిపించ‌ట్లేదు. అస‌లు ఈయ‌న సినిమాలే మానేసి రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని ఓపెన్ గానే చెప్పేసాడు ప‌వ‌న్. ఇలాంటి టైంలో ఆయ‌న‌కు ఒక్క క‌మిట్మెంట్ మాత్రం మిగిలిపోయింది. అదే మైత్రి మూవీ మేక‌ర్స్ తో సినిమా. ఇప్ప‌టికే అంద‌రికి సెటిల్ చేసిన ఈయ‌న‌.. మైత్రికి మాత్ర‌మే బాకీ ప‌డిపోయాడు. ఆస‌క్తి లేకుండా సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుంద‌ని ప‌వ‌న్ కు కూడా ఈ పాటికే అర్థ‌మైన‌ట్లుంది. అజ్ఞాతవాసి, స‌ర్దార్, కాట‌మ‌రాయుడు ఆయ‌న‌కు ఈ విష‌యం బాగా భోద ప‌డేలా చేసాయి. అందుకే సినిమాలు ఇక చాల‌నుకుంటున్నాడు.
ఆయ‌న సినిమాలు చేయ‌న‌ని చెప్పినా కూడా అభిమానులు మాత్రం ఇంకా ఒక్క సినిమా చేస్తే బాగున్ను అనుకుంటున్నారు. పూర్తి స్థాయిగా ప్ర‌జల ముందుకు వెళ్లే ముందు ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తో వెళ్తే ఆ కిక్కే వేరంటున్నారు అభిమానులు. మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఇదే ప్ర‌య‌త్నిస్తుంది. ఐతే ప‌వ‌న్ మాత్రం మ‌న‌సు మార్చుకునేలా క‌నిపించ‌ట్లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత ఉంటే ఉండొచ్చేమో అంటున్నారు కానీ అప్ప‌టి వ‌ర‌కు మైత్రి మూవీ సంస్థ ఆగ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రికి క్లాష్ వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ప‌వ‌న్ కు తామిచ్చిన 12 కోట్ల అడ్వాన్స్.. వ‌డ్డీతో క‌లిపి 20 అయింద‌ని.. అది తిరిగి కావాల్సిందే అని మైత్రి మూవీ మేక‌ర్స్ ప‌ట్టు ప‌డుతున్నట్లు వార్త‌లొస్తున్నాయి.
అస‌లు మైత్రిలో ప‌వ‌న్ చేయాల్సిన సినిమా తెరీ రీమేకే. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య తెలుగులో వ‌చ్చిన వీర‌మ్ ను మ‌ళ్లీ రీమేక్ చేసి దెబ్బ తిన్నాడు ప‌వ‌న్. ఇప్పుడు తెరీ తెలుగులో పోలీసోడుగా వ‌చ్చింది అయినా కానీ మ‌ళ్లీ రీమేక్ చేస్తానంటున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఇప్పుడు ప‌వ‌న్ సినిమాపై వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా తెలుస్తుంది. ఆస‌క్తి లేకుండా సినిమా చేసినా అది స‌రిగ్గా రాక‌పోతే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని వాళ్లు కూడా ఫిక్సైపోయిన‌ట్లుగా తెలుస్తుంది. అందుకే ప‌వ‌న్ నుంచి అడ్వాన్స్ వెన‌క్కి తీసుకోడానికి సిద్ధ‌మ‌య్యారు. మ‌రి దీనికి ప‌వ‌న్ ఏం అంటాడో.. ఇప్ప‌టికే ఏఎం ర‌త్నంతో సెటిల్మెంట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు కూడా మైత్రికి కూడా అడ్వాన్స్ వెన‌క్కి ఇచ్చాడంటే ఇక ప‌వ‌న్ ను సినిమాల్లో చూడటం సాధ్య‌మ‌య్యే ప‌నైతే కాదు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here