ప‌వ‌న్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్..

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. నిజంగానే ప‌వ‌న్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడు. అస‌లే ఇప్పుడు మెగా బంధాల‌న్నీ ముదిరిపాకాన ప‌డ్డాయి. ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడు ఎక్క‌డ క‌నిపించినా అన్న‌య్యే త‌న దేవుడు అంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న మంచివాడు అంటున్నాడు. ఇలాంటి  స‌మ‌యంలో అన్న‌య్య త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ను మాత్రం ఎందుకు వ‌దిలేస్తాడు ప‌వ‌ర్ స్టార్ చెప్పండి..? అందుకే ఇప్పుడు అబ్బాయికి కూడా త‌న‌కు తోచిన సాయం చేస్తున్నాడు. త‌న సినిమాలో చోటిస్తున్నాడు. అయితే సినిమాలో అంటే సినిమాలో న‌టించ‌డం కాదు.. త‌న సినిమా ఉన్న థియేట‌ర్స్ లో రామ్ చ‌ర‌ణ్ సినిమా టీజ‌ర్ ప్లే కానుంద‌న్న‌మాట‌. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న రంగ‌స్థ‌లం టీజ‌ర్ సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. సినిమా మార్చ్ 30న విడుద‌ల కానుంది. పండ‌క్కి మాత్రం టీజ‌ర్ విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 10 అజ్ఞాత‌వాసి సినిమాతో పాటే రంగ‌స్థ‌లం టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. ప‌వ‌న్ సినిమా ఉన్న అన్ని థియేట‌ర్స్ లో అబ్బాయి కూడా సంద‌డి చేయ‌బోతున్నాడు. అలా చేస్తే రంగ‌స్థ‌లంపై అంచ‌నాలు ఇంకా పెరుగుతాయ‌ని ఆశిస్తుంది చిత్ర‌యూనిట్. మ‌రి బాబాయ్ అబ్బాయి క‌లిసి ఏం మ్యాజిక్ చేయ‌బోతున్నారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here