ఫిదా పిల్ల మార‌లే.. శ‌ర్వాతో గొడ‌వ‌లు..?


ప్రేమ‌మ్ తో స్టార్ అయింది.. ఫిదాతో ఒక్క‌సారిగా సూప‌ర్ స్టార్ అయిపోయింది.. దానికి తోడు వ‌ర‌స విజ‌యాలు ఆమెకు వ‌ర‌మ‌య్యాయి. దాంతో సాయిప‌ల్ల‌వి ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌లా సాగిపోతుంది ఇప్పుడు. న‌టిగా ఎంత ఎదిగినా.. క్ర‌మ‌శిక్ష‌ణ‌లో మాత్రం ఇంకా సాయిప‌ల్ల‌వి చాలా ఎద గాలంటూ క్లాసులు పీకుతున్నారు హీరోలు.. ఆమెతో ప‌నిచేస్తోన్న ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే నాగ‌శౌర్య‌.. నాని లాంటి హీరోల‌తో సాయిప‌ల్ల‌వికి గొడ‌వైంద‌ని వార్త‌లున్నాయి. శౌర్య ఈ విష‌యంపై మాట్లాడాడు కూడా. ఇక నాని బ‌య‌ట‌ప‌డ‌లేదంతే.
అయితే షూటింగ్స్ కు లేట్ రావ‌డంతో పాటు డేట్స్ స‌రిగ్గా ఇవ్వ‌కుండా సాయిప‌ల్ల‌వి ఇబ్బంది పెడుతుంద‌నే రూమ‌ర్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు త‌మిళ్ లో న‌టిస్తోన్న సూర్య సినిమా యూనిట్ సైతం ఈ ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలుస్తుంది.
సెల్వ‌రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వితో పాటు ర‌కుల్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. ప‌ల్ల‌వి కార‌ణంగానే కొన్నిసార్లు షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని యూనిట్ సభ్యులే మ్యాట‌ర్ లీక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శ‌ర్వానంద్ తో ప‌డిప‌డి లేచే మ‌న‌సులో న‌టిస్తుంది ఈ భామ‌.
ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ లో కూడా సాయిప‌ల్ల‌వి తీరుపై శ‌ర్వా అసంతృప్తిగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. షూటింగ్ టైమ్ లో క‌నీసం మాట్లాడ‌కుండా.. త‌న పార్ట్ అయిపోగానే ఎక్క‌డో దూరంగా వెళ్లిపోతుంద‌ని.. న‌లుగురుతో క‌ల‌వ‌డం కూడా చేయ‌ట్లేద‌ని సాయి ప‌ల్ల‌విపై వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు అంద‌రితో క‌ల‌వ‌డం రాద‌ని ఆ మ‌ధ్య ప‌ల్ల‌వే చెప్పింది. అయితే ఇదే ఇప్పుడు ఈమె కెరీర్ కు శాపంగా మారుతుందా అనేది మాత్రం తెలియ‌డం లేదు. ఇక్క‌డ ఉండాల‌న్నా.. కెరీర్ నిల‌బ‌డాల‌న్నా.. వీలైనంత త్వ‌ర‌గా ప‌ల్ల‌వి తీరు మార్చుకోవాలి. లేదంటే టాలెంట్ ఉన్నా కూడా అవ‌కాశాలు రాని హీరోయిన్ గా మిగిలిపోవాల్సి వ‌స్తుందేమో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here