ఫిబ్రవరి 9న సాయిధరమ్‌ తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ల ‘ఇంటెలిజెంట్‌’

sai dharam tej vv vinayak movie to come on feb 9th
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఇంటెలిజెంట్‌’ టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ”ఈ చిత్రానికి సంబంధించిన మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. జనవరి 17 వరకు టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవిగారికి ‘ఖైదీ’ ఓ మెమరబుల్‌ మూవీగా నిలిచింది. అలాగే ‘ఇంటెలిజెంట్‌’ సాయిధరమ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుంది” అన్నారు.
సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృథ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here