ఫిబ్ర‌వ‌రి 9.. మ‌రో సినిమా వ‌చ్చేస్తుంది.. 

 "Naga Shaurya & Sai Pallavi Starrer Kanam Trailer"
ఉన్న‌ది ఒక్క‌టే డేట్.. ఆ రోజే అంద‌రూ కావాలంటున్నారు. అందులో ఏముందో తెలియ‌దు కానీ ఒక్కొక్క‌రుగా వ‌చ్చి ఆ డేట్ ను లాక్ చేస్తున్నారు. అదే ఫిబ్ర‌వ‌రి 9. ఈ తేదీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ రోజు నాలుగు సినిమాలు వ‌స్తున్నాయి. అన్నీ గుర్తింపు ఉన్న పెద్ద సినిమాలే. మూడూ ఒకేరోజు వ‌స్తే క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ఉంటుంది. అయినా గానీ ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. ఫిబ్ర‌వ‌రి 9న అంద‌రికంటే ముందు త‌న సినిమా విడుద‌ల తేదీని ఫిక్స్ చేసుకున్నాడు వ‌రుణ్ తేజ్. ఈయ‌న న‌టిస్తున్న తొలిప్రేమ విడుద‌ల కానుంది. వెంకీ అట్లూరి తెర‌కెక్కి స్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది.
ఫిబ్ర‌వ‌రి 9నే తాను ఉన్నానంటూ వ‌స్తున్నాడు నిఖిల్. కిరాక్ పార్టీ చేసుకోడానికి వ‌స్తున్నాడు ఈ కుర్ర హీరో. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ కిరాక్ పార్టీకి రీమేక్. ఇప్పుడు నిఖిల్ సినిమాల‌కు 20 కోట్ల మార్కెట్ వ‌చ్చింది. అంటే ఈ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్న‌ట్లే. ఇక మోహ‌న్ బాబు గాయ‌త్రి కూడా అదే రోజు రానున్న‌ట్లు పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఇక ఇప్పుడు సాయిప‌ల్ల‌వి క‌ణం సినిమా కూడా ఫిబ్ర వ‌రి 9నే విడుద‌ల కానుంది. ఈ మేర‌కు రిలీజ్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించారు. భారీ వీకెండ్ ఉండ‌టంతో కుర్రాళ్లంతా ఇదే తేదీ కావాల‌ని ప‌ట్టు బ‌డుతున్నారు. మ‌రి ఒకేరోజు నాలుగు సినిమాలు వ‌స్తే ఇందులో ఏది విజ‌యం సాధిస్తుందో చూడాలిక‌..!  ఒక‌వేళ అన్నీ బాగుంటే క‌చ్చితంగా అన్ని సినిమాల వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డ‌టం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here