ఫ్యాన్స్ కోస‌మే టైటిల్ మార్చారా..?

MAHESH MAHARSHI LOOK
సూప‌ర్ స్టార్ 25వ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఇన్ని రోజులు ఏమో కానీ కొన్ని రోజులుగా రోజుకో కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఆస‌క్తి పెంచేసాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. పైగా అందులో కొన్ని హింట్లు కూడా ఇచ్చాడు. ఈయ‌న త‌న పోస్ట‌ర్స్ తో ప్రేక్ష‌కుల‌కు ఏదో చెప్పాల‌ని చూసాడు. ఇంట్రెస్టింగ్.. రైజింగ్.. సూప‌ర్ స్టార్.. ల‌వింగ్ అంటూ చూపించి రిషి అనే ప‌దాన్ని హైలైట్ చేసాడు. ఈ సినిమాకు ఇదే టైటిల్ అని అంద‌ర్నీ న‌మ్మించాడు కూడా. ఇదే టైటిల్ పెట్టాల‌ని కూడా అనుకున్నారు. అయితే చివ‌రి నిమిషంలో రిషి పోయి మ‌హ‌ర్షి వ‌చ్చాడు. ఇందులో ఫారెన్ నుంచి ఇండియాకు వ‌చ్చిన కంపెనీ సిఈఓగా ఇందులో న‌టిస్తున్నాడు మ‌హేశ్.
బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది. కాల‌ర్ ఎగ‌రేస్తూ న‌డిచొస్తున్న మ‌హేశ్ ను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. పైగా మీసాల‌తో మ‌రింత కొత్త‌గా ఉన్నాడు సూప‌ర్ స్టార్. రైతు స‌మ‌స్య‌ల ఆధారంగా సినిమా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రుగుతుంది. అల్ల‌రి న‌రేష్ కూడా ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 25వ సినిమా కావ‌డంతో ద‌ర్శ‌కుడు కూడా ఫ‌స్ట్ లుక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో మ‌హేశ్ నుంచి ఊహించ‌ని లుక్ ఇది. ఫ్యాన్స్ ఊహలు అంచ‌నాలు ఎలా ఉంటాయో తెలుసు కాబ‌ట్టే ఇంతగా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు వంశీ. సినిమా వ‌చ్చే ఏడాది ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. దిల్ రాజు, అశ్వినీద‌త్, పివిపి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here