ఫ్రస్టేటెడ్ సింగర్ విజయ్ దేవరకొండ పాడిన GA2 పిక్చ‌ర్స్ "గీతగోవిందం" రెండ‌వ సింగిల్ రేపే విడుదల


అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆ మధ్య విడుదలైన తొలిపాట సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే 19మిలియన్స్ వ్యూస్ తో గోవిందం దూసుకెళ్తున్నాడు. ఇంకేం కావాలి అంటూ గోపీసుంద‌ర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. దీంతో గోవిందం దూకుడు ఆగలేదు. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్ ను ఏకంగా 4 మిలియన్స్ కు పైగా చూసి ఔరా అనిపించారు. విజయ్ దేవరకొండకు మార్కెట్ వాల్యూతో పాటు… ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో దీంతో అర్థమైంది. యూత్ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ తో వచ్చిన రెస్పాన్స్ తో… చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ రౌడీ ఫ్రస్టేటెడ్ సింగర్ గా మారాడు. స్వయంగా ఈ సినిమా కోసం పాడిన పాటను రెండో పాటగా రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫ్రస్టేటెడ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
విజ‌య్‌దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మండన్న జంట‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప‌రుశురాం దర్శకుడు. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 29న ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ….
“గీత గోవిందం మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేసిన ద‌గ్గ‌ర‌నుండి విప‌రీతంగా వైర‌ల్ అవుతూ తెలంగాణా, ఆంథ్రాలోనే కాకుండా ప్ర‌పంచంలో వున్న తెలుగు వారంతా మెబైల్స్ లో, సావ‌న్‌, వింక్‌, ఆదిత్యా, గానా లాంటి ఫేమ‌స్ యాప్స్ లో విన‌ట‌మే కాకుండా డబ్‌స్మాష్ లు వాట్స‌ప్, ఫేస్‌బుక్ స్టేట‌స్ లుగా పెట్టుకుని సుమారు 90 ల‌క్ష‌ల వ్యూస్ ని సాధించి ఇంకేం కావాలి అంటూ ఇంకా ముందుకు దూసుకుపోతోంది. దీంతో పాటు టీజర్ కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 4 మిలియన్ వ్యూస్ ని టచ్ చేసి దూసుకెళ్తోంది. ఆడియెన్స్ రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదిలా వుంటే గీతా గోవిందం చిత్రం నుండి మా ఫ్రస్టేట‌ెడ్ సింగ‌ర్ విజయ్ దేవరకొండ పాడిన‌ సాంగ్ రేపు రిలీజ్ చేయబోతున్నాం. గోపిసుంద‌ర్ సూపర్బ్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 29న పాటల విడుదల కార్యక్రమం గ్రాండ్ గా చేయబోతున్నాం. అన్ని కార్య‌క్రమాలు పూర్తిచేసి అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం.
న‌టీన‌టులు..
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు…
సాంకేతిక నిపుణులు..
స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌
నిర్మాత‌.. బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం… ప‌రుశురామ్‌
సంగీతం.. గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌.. ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. స‌త్య గ‌మిడి
స్క్రిప్ట్ కొ-ఆర్డినేట‌ర్‌.. సీతారామ్‌
లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,
కొరియోగ్రఫి… ర‌ఘు, జాని
ప‌బ్లిషిటి డిజైన‌ర్‌.. అనిల్ భాను
పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here