ఫ్రెండ్ పెళ్లిలో చీర క‌ట్టులో..


సాధార‌ణంగా హీరోయిన్ అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది మోడ్ర‌న్ డ్ర‌స్సులే. వాళ్ల‌ను అరుదుగా చీర‌క‌ట్టులో చూస్తుంటాం. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇలాగే చేసింది. ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో చంపేసింది. అది కూడా మ‌హారాష్ట్ర స్టైల్ లో. మ‌రాఠీ భామ‌లా మారిపోయి అదిరిపోయే క్యాస్ట్యూమ్ తో పిచ్చెక్కించింది పూజా.
ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు.. నిజంగానే మ‌రాఠీ స్టైల్ లోకి మారిపోయింది. దానికి కార‌ణం కూడా ఉంది. ఈ మ‌ధ్యే ముంబైలో త‌న స్నేహితురాలి పెళ్లికి వెళ్లింది పూజా. అక్క‌డ వాళ్ల స్టైల్ లోనే ద‌ర్శ‌న‌మిచ్చింది. ముక్కుపుడ‌క‌.. న‌డుముకు వ‌డ్డానం ఇలా అన్నీ ప‌క్కాగా ప్లాన్ చేసుకుని వెళ్లింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం పూజా రేంజ్ ఎక్క‌డో ఉంది. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత షూటింగ్ లో అడుగు పెట్టింది. ఇక ప్ర‌భాస్..
మ‌హేశ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అన్నీకుదిర్తే రాజ‌మౌళి సినిమాలో చ‌ర‌ణ్ తో జోడీక‌ట్టే ముద్దుగుమ్మ కూడా పూజానే కావ‌చ్చనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూడాలిక‌.. ఈ భామ జాత‌కం 360 డిగ్రీస్ లో ఎలా మారిపోనుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here