ఫ్ర‌స్టేష‌న్ లో క‌ళ్యాణ్ రామ్.

KALYAN RAM SERIES OF FLOPS

పాపం ఏ సినిమా చేసినా.. ఎలాంటి సినిమా చేసినా ఫ‌లితం మాత్రం ఫ్లాప్ అని వ‌స్తుంటే ఏ హీరోకైనా ఫ్ర‌ష్టేష‌న్ త‌ప్ప‌దు. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న కొన్నేళ్లుగా వ‌ర‌స ప్లాపుల్లో ఉన్నాడు. 2015లో ప‌టాస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న క‌ళ్యాణ్..

ఆ త‌ర్వాత మాత్రం వ‌ర‌స డిజాస్ట‌ర్లు ఇస్తున్నాడు. షేర్ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియ‌దు. ఇక యిజం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ కూడా త‌న వంతుగా క‌ళ్యాణ్ కు ఓ ప్లాప్ ఇచ్చాడు. నిజానికి ఇది క‌ళ్యాణ్ రామ్ ఇమేజ్ కు భిన్నంగా వ‌చ్చిన సినిమా. ఇక దానిత‌ర్వాత చేసిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా అవు తుంద‌ని చేసిన ఎమ్మెల్యే సైతం ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు వ‌చ్చిన నా నువ్వే అయితే డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ అయిపోయింది.

తొలిరోజే ఈ చిత్రాన్ని ఔట్ రేటెడ్ గా రిజ‌క్ట్ చేసారు ప్రేక్ష‌కులు. జ‌యేంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్. తొలిసారి పూర్తిస్థాయి ప్రేమ‌క‌థలో న‌టించాడు క‌ళ్యాణ్ రామ్. కానీ నిరాశే మిగిలింది. దాంతో ఇప్పుడు ఈయ‌న ఎలాంటి క‌థ చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నాడు. అస‌లెందుకు ఇంత‌గా త‌న‌కు ఫ్లాపులు వ‌స్తున్నాయి అని ఆరా తీసుకుంటున్నాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి చూడాలిక‌.. దీనికి కార‌ణం ఏమై ఉంటుందో.. నంద‌మూరి హీరో దీనికి స‌మాధానం ఎప్ప‌టికి క‌నిపెడ‌తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here