ఫ‌స్ట్ కాపీతో ఈ నెల‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైన GOOGLY (గుడ్ బ్యాడ్ అగ్లీ)

Googly - Good bad ugly to to release in February Lakshmi • Now
గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగ‌రిత‌నం ఈ ప‌దాలు మ‌న‌కు తెలిసిన‌వే. కాక‌పోతే సంద‌ర్భానుసారం అవి బ‌య‌ప‌డుతుంటాయి. మ‌నం వాటిని అలాగే త‌గిన సంద‌ర్భంలో ఉప‌యోగిస్తుంటాం. ఇప్పుడు వీటినే టైటిల్‌గా పెట్టి  ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెరకెక్కిస్తోన్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సంగీత సారథ్యం వ‌హించ‌డం కూడా విశేషం. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత‌.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వర‌లోనే విడుద‌లకు ఫ‌స్ట్ కాపీతో సిద్ధం అయింది. ఈ సంద‌ర్భంగా…
ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ, ”కొన్ని మంచి కార‌ణాల వ‌ల్లే ఈ సినిమా కాస్త ఆలస్య‌మ‌యింది. న‌న్ను న‌మ్మి, నాకు ఇంత టైమ్ కేటాయించిన నా టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న ట్రెండ్ ప్ర‌కారం గుడ్ బ్యాడ్ అగ్లీని, రిలీజ్ త‌ర్వాత GBU అని చెప్తారు. అది విన‌డానికి కూడా బాలేదు.  అందుకే మేమే ఈ సినిమాకు గూగ్లీ అని పెట్టుకుంటున్నాం. గూగ్లీ అంటే అంద‌రికీ తెలుసు. బౌలింగ్ లో అదొక టైప్ బౌలింగ్. బాల్ వేసిన త‌ర్వాత అది ఎప్పుడు ఎక్క‌డ ఎలా ప‌డుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. మ‌నిషి స్వభావం కూడా అలాంటిదే నేను న‌మ్ముతాను. ఈ సినిమా క‌థాంశం కూడా అదే కాబ‌ట్టి సినిమాకు ఈ పేరును ఫిక్స్ చేశాం. ఏదో పెట్టాల‌ని పెట్ట‌కుండా, మా సినిమా లోనుంచే గూగ్లీ అని సెలెక్ట్ చేసుకున్నాం.  షూటింగ్ పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. వీలైనంత త్వర‌గా సెన్సార్ కు పంపి, సెన్సార్ అయిన వారం త‌ర్వాతే సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మా క‌ష్టం ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం” అన్నారు.
నిర్మాత అంజిరెడ్డి మాట్లాడుతూ, ”సినిమా చాలా బాగా వ‌చ్చింది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సినిమాను చాలా ప్యాష‌న్ తో తెర‌కెక్కించాడు. ఫ్యామిలి అంతా కలిసి కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటుంది. నెలాఖ‌రున సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
హీరోయిన్ శ్రీముఖి మాట్లాడుతూ, ”ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. న‌న్ను నేను కొత్త‌గా చూసుకునే అవ‌కాశ‌మిచ్చిన హర్ష‌కు థ్యాంక్స్. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే సెన్సార్ చేసుకుని, ఈ నెలాఖ‌రులోగా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా.. ”అన్నారు.
టీఎన్ఆర్ మాట్లాడుతూ, ”ఈ మ‌ధ్య కాలంలో హైప్ తెచ్చుకున్న సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఒక‌టి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఎదురుచూస్తున్నా.. ఫైన‌ల్ గా ఈ ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌నున్నాం. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
ముర‌ళి, శ్రీముఖి, కిషోర్‌, అజ‌య్‌గోష్‌, టిఎన్ఆర్‌; మ‌హేష్ క‌త్తి, సంతోష్‌, చెర్రి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః సురేష్‌, ర‌వి, ఎడిటింగ్ఃకిషోర్‌, ఆర్ట్ః ఆనంద్‌, స్టంట్స్ః శ్రీధ‌ర్‌,  మ్యూజిక్ డిజైన్‌, ప్రోగ్రామింగ్ః క‌మ‌ల్‌, సాహిత్యంః చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, నిర్మాతః అంజిరెడ్డి, ర‌చ‌న‌, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here