బావ సినిమాకు చ‌ర‌ణ్ షాక్..!


అదేంటి.. బావ సినిమాకు చ‌ర‌ణ్ షాక్ ఇవ్వ‌డం ఏంటి..? పైగా చెల్లి భ‌ర్త క‌దా.. అంతా స‌పోర్ట్ గానే ఉన్నారు అంత‌లోనే ఏమైంది అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండ‌స్ట్రీ.. బిగ్ బాస్ 2 హౌజ్ కంటే దారుణం. ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఒకేరోజు విజేత‌తో పాటు మ‌రో సినిమా కూడా విడుద‌లైంది. అదే ఆర్ఎక్స్ 100. అది పూర్తిగా కొత్త వాళ్లు చేసిన సినిమా. ఇది కూడా కొత్త వాళ్ల సినిమానే అయినా కూడా మెగా బ్యాగ్రౌండ్ ఉంది కాబ‌ట్టి మెగా హీరోల ఓటు కూడా బావ‌కే ఉంటుంది.
అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ మాత్రం డిఫెరెంట్ గా ఆలోచించాడు. ఈయ‌న త‌న స‌పోర్ట్ తొలిరోజే మ‌రో హీరోకు ఇచ్చాడు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి మ‌రీ అభినందించాడు రామ్ చ‌ర‌ణ్. బోయ‌పాటి సినిమా సెట్స్ కు పిలిపించుకుని ఆర్ఎక్స్ 100 టీంను పొగిడాడు మెగా వార‌సుడు.
ఓ వైపు బావ విజేత సినిమా విడుద‌లైతే ఆ సినిమాను కాకుండా దానికి పోటీగా వ‌చ్చిన మ‌రో సినిమా హీరోను చ‌ర‌ణ్ క‌ల‌వ‌డం మాత్రం విచిత్ర‌మే. ఇదంతా ఇలా ఉంటే ప్రేక్ష‌కుల ఓటు మాత్రం విజేత వైపు ప‌డుతుంది. ఆర్ఎక్స్ 100లో హాట్ సీన్స్ తో పాటు లిప్ లాక్స్ ఉండ‌టంతో సాధార‌ణంగా యూత్ ఈ చిత్రం వైపు అడుగేస్తున్నారు కానీ విజేత సినిమాకు మాత్రం టాక్ బాగుంది. మ‌రి ఇలాంటి టైమ్ లో ఈ చిత్ర ప్ర‌మోష‌న్ మానేసి అక్క‌డికి వెళ్ల‌డం ఏంటో చ‌ర‌ణ్ కే అర్థం కావాలి. చూడాలిక‌.. ఈ ప‌రిస్థితుల్లో చివ‌రికి విజేత భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here