బిగ్ బాస్ 2.. ఆట ఇప్పుడు మొద‌లైంది..!


బిగ్ బాస్ సీజ‌న్ 2 మొద‌లై అప్పుడే మూడు వారాలు అయిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కామ‌న్ మ్యాన్స్ ను మాత్ర‌మే బ‌య‌టికి పంపిస్తూ వ‌చ్చారు. కానీ తొలిసారి ఓ సెలెబ్రెటీ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు. కిరీటి ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ఒక్క ఎపిసోడ్ కార‌ణంగా ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చేసాడ‌ని నాని చెబుతున్నాడు. ముందు నుంచీ ఈ వారం ఇంటి నుంచి గ‌ణేష్ ఎలిమినేట్ అవుతాడేమో అని ఊహించారంతా. కానీ స‌డ‌న్ గా సీన్ లోకి కిరీటిని తీసుకొచ్చారు. అయితే కిరిటీ బ‌య‌టికి రావ‌డం వెన‌క కూడా స్టార్ యాజ‌మాన్యం గేమ్ ప్లాన్ ఉంద‌ని తెలుస్తుంది.
ఈ వారం గ‌ణేష్ ను పంపిస్తే కావాల‌నే కామ‌న‌ర్స్ ను టార్గెట్ చేసి పంపించార‌ని విమ‌ర్శ‌లు ఇంకా ఎక్కువ‌వుతాయ‌ని ఆలోచించే ఈ ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అస‌లే ఇప్ప‌టికే సంజ‌న‌.. నూత‌న్ నాయుడు ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. ఇప్పుడు గ‌ణేష్ కూడా వ‌స్తే ర‌చ్చ ఇంకా ఎక్కువ‌వుతుంది. మొత్తానికిప్పుడు అస‌లు ఆట మొద‌లైంది. వ‌చ్చే వారం కూడా గ‌ణేష్ ఇలాగే బ‌తికి బ‌య‌టికి రాకుండా ఉంటాడేమో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here