బిగ్ బాస్ 2 బ్యాచ్ అంతా కేరాఫ్ కాంట్ర‌వ‌ర్సీ..!


బిగ్ బాస్ తొలి సీజ‌న్ చాలా స్మూత్ గా సాగిపోయింది. అప్పుడు ఈ షో అంటే ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు కాబ‌ట్టి కాంట్ర‌వ‌ర్సీల జోలికి కూడా పోలేదు. కానీ రెండో సీజ‌న్ మాత్రం చాలా కొత్త‌గా.. సంచ‌ల‌నంగా ప్లాన్ చేస్తున్నారు స్టార్ యాజ‌మాన్యం. హోస్ట్ కూడా ఎన్టీఆర్ నుంచి నాని వ‌చ్చాడు. రెండో సీజ‌న్ చూస్తుంటే మ‌రింత భారీగా రెడీ అవుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. పైగా తొలి సీజ‌న్ కంటే నెల రోజులు ఎక్కువే ఉండ‌బోతుంది ఇది. 100 రోజుల పాటు సాగే ఈ గేమ్ షోలో 16 మంది సెలెబ్రెటీస్ ఉండ‌బోతున్నారు. జూన్ 10 నుంచి సీజ‌న్ మొద‌లు కానుంది. ఇక ఇందులో పాల్గొనే వాళ్ల లిస్ట్ చూస్తుంటే దిమ్మ తిర‌గ‌డం ఖాయం. ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం బిగ్ బాస్ 2లో ఒక‌ప్ప‌టి ల‌వ‌ర్ బాయ్ త‌ర‌ణ్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ హీరోకు కావాల్సిన‌న్ని కాంట్ర‌వ‌ర్సీలు ఉన్నాయి. పైగా డ్ర‌గ్ కేస్ లో కూడా పేరుంది. ఇక ఈయ‌న‌తో పాటు సినిమాలు లేక ఖాళీగా ఉన్న వ‌రుణ్ సందేశ్.. ఎప్పుడో సినిమాలు మానేసిన‌ అల్ల‌రి న‌రేష్ అన్న‌య్య ఆర్య‌న్ రాజేష్.. అప్పుడ‌ప్పుడూ క‌నిపించే ధ‌న్య బాల‌కృష్ణ‌న్.. ఎప్పుడో క‌నిపించ‌డం మానేసిన మంజుల కూతురు శ్రీ‌దేవి.. యాంక‌ర్ శ్యామ‌ల‌.. జ‌నం పూర్తిగా మ‌ర్చిపోయిన హీరోయిన్ గ‌జాలా.. సీనియ‌ర్ హీరోయిన్ రాశీ.. యాంక‌ర్ లాస్య‌.. సెన్సేష‌న‌ల్ శ్రీ‌రెడ్డి.. హీరోయిన్ ఛార్మి.. సింగ‌ర్ గీతామాధురి ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ లిస్ట్ చూస్తుంటేనే అబ్బో అనిపిస్తుంది. మ‌రి చూడాలి.. రెండో సీజ‌న్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here