బిగ్ బాస్ 2.. ల‌వ‌ర్స్ అడ్డా..!


ఇది బిగ్ బాస్.. ఇక్క‌డ ఏదైనా జ‌ర‌గొచ్చు.. అని ముందు నుంచే చెబుతున్నాడు నాని. అన్న‌ట్లుగానే ఇక్క‌డ ఏదేదో జ‌రుగుతుంది. అస‌లు ఊహించ‌న‌ది కూడా జ‌రుగుతుంది. అప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని వ్య‌క్తులు కూడా ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు.
బిగ్ బాస్ 2 ఇప్పుడు ల‌వ‌ర్స్ అడ్డాగా మారిపోతుంది. ఎవ‌రు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డుతున్నారో తెలియ‌డం లేదు. ఇదే విష‌యాన్ని నాని కూడా బాగానే హైలైట్ చేస్తున్నాడు. ఇంకాఇంకా అంటూ ఆట ప‌ట్టిస్తున్నాడు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌజ్ లో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. వాళ్లే సామ్రాట్ అండ్ తేజ‌స్వీ. కొన్ని రోజులుగా వీళ్ళ మ‌ధ్య రిలేష‌న్ బ‌లంగా మారిపోతుంది. ఒక‌ర్ని విడిచి మరొక‌రు ఉండ‌లేక‌పోతున్నారు.
అక్క‌డ వాళ్లు అది కావాల‌ని చేస్తున్నారా.. లేదంటే నిజంగానే ప్రేమ పుట్టిందా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి తెలియ‌డం లేదు కానీ ఏదో జ‌రుగుతుంద‌నేది మాత్రం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఏదైనా జ‌ర‌గొచ్చు.. ఏదైనా జ‌ర‌గొచ్చు అంటే ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదు. సామ్రాట్ తో పాటు త‌నీష్ కూడా దీప్తి సున‌య‌న‌తో ఎక్కువ‌గా ఉంటున్నాడు. అదేంట‌ని అడిగితే బాగుంటుంది అత‌డితో కంపెనీ అంటూ దీప్తి కూడా చెబుతుంది. దాంతో ఇప్పుడు ప్రేమలో తేలిపోతుంది బిగ్ బాస్ 2 హౌజ్. మ‌రి ఈ బంధాలు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here