బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా యువ ప్రతిభాశాలి శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ.. “ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో మా బ్యానర్ ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. “దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్” లాంటి సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడు గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాగారిని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే మిగతా నటీనటుల మరియు సాంకేతిక నిపుణులను ప్రకటిస్తాం. ఫిబ్రవరి 22న హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, సహ నిర్మాత: చాగంటి శాంతయ్య, నిర్మాత: నవీన్ సొంటినేని (నాని), నిర్మాణం: వంశధార క్రియేషన్స్, దర్శకత్వం: శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here