” బేవ‌ర్స్” టీజ‌ర్ ని లాంచ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌

“ఆన‌లుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని రెండింత‌లు సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌.  ఈ చిత్రం తో సంజోష్ హీరో గా ప‌రిచ‌యం అవుతున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో  S క్రియెష‌న్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్  అర‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కడు పూరిజ‌గ‌న్నాథ్ గారు చేతుల మీదుగా విడుద‌ల చేశాము.  హ‌ర్షిత  ఈ చిత్రంలో  హీరోయిన్ గా చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. సునీల్ కాశ్య‌ప్ సంగీతాన్ని అందించారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు  పొన్నాల చందు, ఎమ్‌. అర‌వింద్ లు మాట్లాడుతూ..  డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు న‌టించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓక‌టి. అలాంటి చిత్రానికి రైట‌ర్ గా ప‌నిచేసిన ర‌మేష్ చెప్పాలా ద‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌.  ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ టీజ‌ర్ ని పూరిజ‌గ‌న్నాథ్ గారి చేతుల మీదుగా విడుద‌ల చేసినందుకు మాకు చాలా ఆనందంగా వుంది. అంతేకాదు ఆయ‌న మాకు టైం ఇచ్చినందుకు మా యూనిట్ త‌రుపున ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. మా  బ్యాన‌ర్ S క్రియెష‌న్స్ పై ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. ఇటీవ‌లే మంచి సాంగ్ షూట్ తో చిత్ర షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో సంజోష్‌, హ‌ర్షిత లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. అతి త్వ‌ర‌లో ఆడియో రిలీజ్ చేసి చిత్రం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తాము.. అని అన్నారు.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ గారు మాట్లాడుతూ.. బేవ‌ర్స్ టీజ‌ర్ చాలా బావుంది. హీరో సంజోష్ కి మంచి ఫ్యూచ‌ర్ వుంది. చిత్ర యూనిట్ కి నా ఆల్ ద బెస్ట్‌..
డా.. రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో చేస్తున్న ఈ చిత్రంలో సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు..
 సంగీతం- సునీల్ కాశ్య‌ప్‌, సాహిత్యం- సుద్దాల అశోక్ తేజ్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, మండ్యం అర‌వింద్‌, ఎడిటింగ్‌- ఎం.ఆర్ వ‌ర్మ‌, ఆర్ట్- ర‌ఘు కుల‌క‌ర్ణి, కెమెరా – కె చిట్టిబాబు, ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం-ర‌మేష్ చెప్పాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here