బోనాల పండుగ కానుకగా రమ్యకృష్ణ 'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ విడుదల


తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఇటీవల బాహుబలి సీరిస్‌లో రాజమాత శివగామిగా పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతమైన అభినయంతో అందర్ని అలరించిన ఈ సీనియర్ నటి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోన్న శక్తివంతమైన చిత్రం రాణి శివగామి.
రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి మధు మిణకన్ గుర్కి దర్శకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు ఫస్ట్‌లుక్‌ను బోనాల పండుగ సందర్భంగా విడుదల చేశారు.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ రమ్యకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రమిది.
ఆమెను కొత్తకోణంలో ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. పీరియాడిక్ డ్రామా విత్ సోషియోఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిత్రాన్ని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ తొమ్మిదవ శతాబ్ధంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్ధం వరకు కొనసాగుతుంది.
ఈ కాలఘట్టంలో జరిగే సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. తొమ్మిదవ శతాబ్ధానికి, 21వ శతాబ్దనికి వున్న సంబంధం ఏమిటనేది ఈ చిత్ర కథ. యుద్ద సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా వుంటాయి. శివగామిగా రమ్యకృష్ణ నటన చిత్రానికి ప్రధాన హైలైట్‌గా వుంటుంది.. అన్నారు.
రమ్యకృష్ణ, రవికాలే, గోలీసోడా మధు, అవినాష్, ప్రవీణ్, పాయల్ రాధాకృష్ణ, రమేష్ పండిట్, కారుమంచి రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమ్రత్, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: కెఎమ్ ప్రకాష్, ఆర్ట్: బాబుఖాన్, సహ నిర్మాతలు: దబ్బుగుంట వెంకటశేషయ్య యాదవ్, దబ్బుగుంట మహేష్‌కుమార్ యాదవ్, నిర్మాత: మురళీ కృష్ణ దబ్బుగుడి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధు మిణకన గుర్కి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here