బ్రాండ్.. బాబును బ‌తికిస్తుందా..?

BRAND-BABU-TRAILER
చిన్న సినిమాల నుంచి వ‌చ్చాడు కాబ‌ట్టి ఆ క‌ష్టాలు ఎలా ఉంటాయో మారుతికి బాగా తెలుసు. ఆ రోజుల్లో తాను ప‌డిన క‌ష్టాలన్నింటినీ ఇప్ప‌టికీ గుర్తు పెట్టుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే ఇప్ప‌టికీ చిన్న సినిమాల‌కు ప్రాణంగా ఉంటున్నాడు మారుతి. త‌న‌కు చేతనైనంత వ‌ర‌కు సాయం చేస్తున్నాడు. అయితే ఊరికే మాత్రం కాదు.. డ‌బ్బులు తీసుకుని చిన్న సినిమాకు ఊపిరి ఊదుతున్నాడు.
త‌న బ్రాండ్ వాళ్ల‌కు ఇస్తూ కోట్లు వెన‌కేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయ‌న బ్రాండ్ బాబు సినిమాకు క‌థ అందించాడు. ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌కుడు. సాధార‌ణంగా ఈ చిత్రం గురించి పెద్ద‌గా మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం అయితే లేదు. ఎందుకంటే ఇందులో కొత్త హీరో సుమంత్ న‌టిస్తున్నాడు.
కాక‌పోతే బ్రాండ్ బాబు గురించి ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతుందంటే దానికి కార‌ణం మారుతి. దీనికి క‌థ అందించింది.. స‌మ‌ర్ప‌కుడిగా ఉంది ఈయ‌నే. ఇందులో హీరో ప్ర‌తీది బ్రాండ్ కావాల‌నుకుంటాడు. సాధార‌ణంగా మారుతి త‌న స్టైల్ లోనే ఈ క‌థ రాసాడు. ప్ర‌తీ సినిమాలోనూ హీరోకు ఏదో ఓ ప‌ర్టిక్యుల‌ర్ డిసీజ్ పెడుతుంటాడు. ఇప్పుడు ఇదే చేసాడు. ఈ సారి బ్రాండ్ వీక్ నెస్ అన్న‌మాట‌. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే మారుతి మార్క్ క‌నిపిస్తుంది. అయితే కొత్త హీరోతో కాకుండా మ‌రో కుర్ర హీరోతో చేసుంటే బాగుండేదనే టాక్ ఉంది. ఆగ‌స్ట్ 3న విడుద‌ల కానుంది బ్రాండ్ బాబు. మ‌రి మారుతి బ్రాండ్.. ఈ బాబును బ‌తికిస్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here