బ‌న్నీ అలా ఫిక్స్ అయిపోయాడా..?


ఈ రోజుల్లో హీరోలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు..? ఓ సినిమా పూర్తి కాగానే మ‌రో రెండు మూడు సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఎన్టీఆర్.. చ‌ర‌ణ్.. ప్ర‌భాస్.. మ‌హేశ్.. ఇలా ఎవ‌ర్ని తీసుకున్నా కూడా ఇప్పుడు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. చివ‌రికి చిరంజీవి లాంటి సీనియ‌ర్ హీరో కూడా ఓ సినిమా పూర్తి కాక‌ముందే మ‌రో రెండు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు. కానీ అల్లుఅర్జున్ మాత్రం ఇప్ప‌టికీ నెక్ట్స్ ఏంటో తేల్చుకోలేక‌పోతున్నాడు.
ఈ మ‌ధ్యే నా పేరు సూర్య‌తో డిజాస్ట‌ర్ అందుకున్నాడు బ‌న్నీ. దాంతో త‌ర్వాతి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఈ సారి ఏ ప్ర‌యోగాలు లేకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ ఒక‌టి సిద్ధం చేయాల్సిందిగా త‌న ద‌గ్గ‌రికి వ‌స్తున్న ద‌ర్శ‌కుల‌కు చెబుతున్నాడు బ‌న్నీ.
ఇప్ప‌టికే విక్ర‌మ్ కే కుమార్ చెప్పిన క‌థ న‌చ్చినా.. ఎందుకో కానీ ఈ చిత్రాన్ని ప‌క్క‌న‌బెట్టాడు ప్ర‌స్తుతానికి. దాంతో పాటు త్రివిక్ర‌మ్ లైన్ లోనే ఉన్నా.. ఆయ‌న ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసుకుని రావాలి. ఈ క్ర‌మంలోనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ బ‌న్నీకి బాగా న‌చ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఇది ప‌క్కా పొలిటిక‌ల్ డ్రామా అని.. పూర్తిక‌థ సిద్ధం చేసుకుని రావాల్సిందిగా ఆ ద‌ర్శ‌కున్ని బ‌న్నీ కోరాడ‌ని తెలుస్తుంది. అత‌డి పేరు సంతోష్ రెడ్డి అనే టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. అయితే ఈ సినిమాపై కూడా క్లారిటీ లేదు. అంటే ఇంకొంత కాలం బ‌న్నీ మాట కోసం అభిమానులు వేచి చూడ‌క త‌ప్ప‌దు. మ‌రి చూడాలిక‌.. సూర్య ఇచ్చిన షాక్ నుంచి బ‌న్నీ ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here