భళ్లాలదేవ తో జతకట్టనున్న కట్టప్ప


వరస విజయల తో దూసుకుపోతున్న రానా ఘాజి తరహాలో మరో చరిత్ర నేపధ్య చిత్రం చేయబోతున్నారు. తమిళ్, తెలుగు మరియు హిందీలో విడుదల కాబోయే ఈ చిత్రానికి ౧౯౪౫ (తమిళం లో మడై థిరందు) అనే టైటిల్ ఖరారు చేసారు. రెజినా, లీషా ఎక్లెయిర్ లు కథానాయికలు గా నటించే ఈ చిత్రంలో బాహుబలి లో కట్టప్ప గా అలరించిన సత్యరాజ్ కీలకపాత్ర చేస్తున్నారట. బిజ్జలదేవ గా కనిపించిన నాజర్ కూడా నటించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఓవర్సీస్ హక్కులను ప్రఖ్యాత సరిగమ సినిమాస్ చేజిక్కించు కుంది. యువన్ శంకర్ రాజా బాణీలు కట్టే ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు.