భాగ‌మ‌తి.. 31 కోట్లు నాటౌట్.. 

Bhaagamathie
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇండ‌స్ట్రీలో బ‌త‌క‌డ‌మే అరుదు. అలాంటిది ఓ సినిమా విడుద‌లై.. రెండు వారాల త‌ర్వాత కూడా ఇంకా వ‌సూళ్లు సాధిస్తుందంటే అది అద్భుతం అయ్యుండాలి. ఆ అద్భుతానికి అనుష్క కార‌ణ‌మై ఉండాలి. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. భాగ‌మ‌తి సినిమా వ‌సూళ్లు చూసి హీరోల క‌ళ్లు కూడా బైర్లు గ‌మ్ముతున్నాయి. 10 రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 31 కోట్లు వ‌సూలు చేసింది. ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ 30 కోట్ల‌కు అమ్మారు. అంటే ఇప్ప‌టికే వ‌సూళ్లు తిరిగి వ‌చ్చేసాయ‌న్న‌మాట‌. ఇప్పట్నుంచి వ‌చ్చేవ‌న్నీ లాభాలే. అయితే తెలుగులోనే ఈ చిత్రం ఎక్కువ వ‌సూళ్లు సాధించింది. కేవ‌లం తెలుగు వ‌ర్ష‌న్ 10 రోజుల్లో 25 కోట్లు వ‌సూలు చేసింది. త‌మిళ‌నాట మ‌రో 4.5 కోట్లు.. కేర‌ళ‌లో 1.4 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింది భాగ‌మ‌తి.
అస‌లు అనుష్క సినిమా ఏంటి ఇంత‌గా వ‌సూలు చేస్తుంద‌ని హీరోలు కూడా అసూయ పడుతున్నారు ఇప్పుడు. ఈ వారం ఛ‌లో.. ట‌చ్ చేసి చూడు వ‌చ్చినా కూడా రెండో వారంలోనూ భాగ‌మ‌తి దూకుడు కొన‌సాగుతుంది. అశోక్ తెర‌కెక్కించిన ఈ చిత్రం క‌చ్చితంగా 35 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే అరుంధ‌తి రికార్డుల‌ను సైతం భాగ‌మ‌తి తిర‌గ‌రాసిన‌ట్లే. ప్ర‌స్తుతం ఛ‌లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. ట‌చ్ చేసి చూడు ఫ్లాప్ కావ‌డం భాగ‌మ‌తికి క‌లిసొచ్చింది. మొత్తానికి చూడాలిక‌.. భాగ‌మ‌తి జ‌ర్నీ ఎక్క‌డ ఆగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here