మా మామ‌కే అన్నీ సాధ్య‌మంటున్న లోకేష్.. 

Jai Simha Audio Launch Event Photos Set 5
నారా లోకేష్ ను సినిమా వేడుక‌ల్లో చూడ‌టం చాలా త‌క్కువ‌. ఆయ‌న రాజ‌కీయాల‌తోనే బిజీగా ఉంటాడు. అలాంటి వ్య‌క్తి బాల‌య్య సినిమా వేడుక‌కు వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనూ త‌న మార్క్ స్పీచ్ ఇచ్చాడు లోకేష్. ముద్దుల మామ‌య్య అంటూ బాల‌య్య‌ను తెగ పొగిడేసాడు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి బాల‌య్య‌ను చూస్తున్నాన‌ని.. తాను ముస‌లి వాన్ని అయిపోతున్నాను కానీ ఆయ‌న మాత్రం ఇంకా అలాగే యంగ్ గా ఉన్నాడ‌ని చెప్పాడు నారా వార‌బ్బాయి. ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది హీరోలున్నా.. ఓ హీరో కోసం ప్రాణ‌మైనా ఇచ్చే అభిమానులు కేవ‌లం బాల‌య్య‌కే ఉన్నార‌న్నాడు లోకేష్. అంతేకాదు.. ఇండ‌స్ట్రీలో చ‌రిత్ర తిర‌గ‌రాయాల‌న్నా.. సృష్టించాల‌న్నా రెండూ ఒక్క బాల‌య్యకే సాధ్య‌మ‌న్నాడు. 1955లో ఎన్టీఆర్ జ‌య‌సింహాతో పెద్ద హిట్ కొట్టార‌ని.. ఇప్పుడు 2018లో జై సింహాతో బాల‌య్య చ‌రిత్ర తిర‌గ‌రాస్తాడ‌ని చెబుతున్నాడు ఈ ఐటి మినిస్ట‌ర్. మొత్తానికి మావ‌య్య‌కు పోటీగా స్పీచ్ బాగానే సిద్ధం చేసుకుని వ‌చ్చాడు నారా లోకేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here