మీనాను త‌ల్లిని చేస్తున్నారుగా.. 

టైటిల్ చూసి త‌ప్పుగా అనుకోవ‌ద్దు. ఇండ‌స్ట్రీలో రోజులు మారుతున్నాయి.. ఏళ్లు గ‌డుస్తున్నాయంటే నిన్న‌టి త‌రం హీరోయిన్ల‌కు త‌ల్లి పాత్ర‌ల‌కు టైం వ‌చ్చింద‌ని అర్థం. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు త‌ల్లి పాత్ర‌ల‌కు ఫిక్స్ అయిపోయారు. నిన్న‌టి త‌రం గ్లామ‌ర్ క్వీన్స్ కూడా ఇప్పుడు అమ్మ‌లుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఈ టైమ్ మీనా వ‌ర‌కు కూడా వ‌చ్చేసింది. ఇప్ప‌టికే న‌దియా.. ఖుష్బూ.. ఆమ‌ని లాంటి వాళ్లు చాలా మంది హీరోల‌కు త‌ల్లి పాత్ర‌ల్లో సెట్ అయిపోతున్నారు. ఇప్పుడు మీనా కూడా ఇదే కోవ‌లోకి చేరిపోయింది. ఈమె ఓ కుర్ర హీరోకు అమ్మగా మారిపోయింది. ఆ హీరో ఎవ‌రో కాదు బెల్లంకొండ శ్రీ‌నివాస్. అవును.. బెల్లంకొండ హీరోగా శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తున్న సాక్ష్యంలో హీరో త‌ల్లిగా న‌టిస్తుంది మీనా. ఇప్ప‌టి వ‌ర‌కు మీనా సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో ఏ హీరోకు త‌ల్లిగా న‌టించ‌లేదు. దృశ్యంలో ఇద్ద‌ర‌మ్మాయిల‌కు త‌ల్లిగా న‌టించింది కానీ హీరోల‌కు మాత్రం త‌ల్లి కాలేదు. ఇప్పుడు సాక్ష్యం కోసం మారిపోయింది.
ఈ చిత్రం త‌న‌కు క‌చ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది అంటుంది మీనా. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొద‌లైన మీనా జ‌ర్నీ ఇప్పుడు అమ్మ పాత్రల వ‌ర‌కు సాగుతుంది. ఇక ఈ సినిమాతో పాటు త్రివిక్ర‌మ్ సినిమాలోనూ మీనానే ముఖ్య పాత్ర‌లో తీసుకోవాల‌ని ఆలోచిస్తున్నారు. అయితే ఈ పాత్ర కోసం మీనాతో పాటు ఊహ‌, ల‌య లాంటి హీరోయిన్లు కూడా పోటీ ప‌డుతున్నారు. క‌చ్చితంగా చాలా రోజులుగా సినిమాలు చేయ‌ని వాళ్ల‌నే తీసుకోవాల‌ని చూస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఈ లిస్ట్ లో మీనా కూడా ఉంది. ఒక్క‌సారి త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తే వ‌చ్చే క్రేజే వేరుగా ఉంటుంది. న‌దియాని చూస్తే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. మొత్తానికి చూడాలిక‌.. త‌ల్లిగా మీనా ఎలా ఉండ‌బోతుందో..? సాక్ష్యం మే 11న విడుద‌ల కానుంది. త్రివిక్ర‌మ్ సినిమా మార్చ్ లో మొద‌లు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here