మున్నాభాయ్ తో 3 ఇడియ‌ట్స్..

కాంబినేష‌న్ కొత్త‌గా ఉంది క‌దా..! ఇప్పుడు ఇదే ట్రై చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణీ. ఈయ‌న కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో మున్నాభాయ్ కూడా ఒక‌టి. 12 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ శంక‌ర్ దాదాగా వ‌చ్చి హిట్ అయింది. ఆ త‌ర్వాత గాంధీగిరి అంటూ ల‌గేర‌హో మున్నాభాయ్ తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు రాజ్ కుమార్ హిరాణి. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయ‌బోతున్నాడు. చాలా ఏళ్లుగా మున్నాభాయ్ మూడో భాగంపై వార్త‌లు వ‌స్తున్నా కూడా టైమ్ కుద‌ర్లేదు.

ఆ మ‌ధ్య సంజ‌య్ జైల్లో ఉండ‌టంతో 3 ఇడిట‌య్స్.. పీకే లాంటి సినిమాలు చేసాడు హిరాణి. ఇక ఇప్పుడు సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ సంజూతో బిజీగా ఉన్నాడు. జూన్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. సంజూ త‌ర్వాత మున్నాభాయ్ ఛ‌లే అమెరికా అంటున్నాడు రాజ్ కుమార్ హిరాణి. ఈ చిత్రంలోనూ సంజ‌య్ ద‌త్, అర్ష‌ద్ వార్షీలు మ‌రోసారి త‌మ పాత్ర‌ల్ని రీ ప్లేస్ చేయ‌బోతున్నారు. మున్నాభాయ్ త‌ర్వాత 3 ఇడియ‌ట్స్ కు కూడా సీక్వెల్ చేయ‌బోతున్నాడు హిరాణి. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం క‌థ రాయ‌డం కూడా మొద‌లుపెట్టాడు రైట‌ర్ అభిజిత్ జోషి. మొత్తానికి ఒకేసారి రెండు ఇండ‌స్ట్రీ హిట్స్ కు సీక్వెల్స్ ముహూర్తం పెడుతున్నాడు రాజ్ కుమార్ హిరాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here