మెగా అల్లుడి కోడి పాట అదిరింది..

కోడికి సంతాపం అంటూ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసి ఆస‌క్తి పుట్టించాడు మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్. ఇప్పుడు ఈ పాట విడుద‌లైంది. కో కొక్కోరోక్కో అంటూ సాగే ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాసాడు. కోడి చేసే త్యాగాలు ఇన్ని ఉన్నాయి అనిపించేలా ఈ పాట రాసాడు శాస్త్రి.

చికెన్ తో ఎన్ని వెరైటీలు అయితే చేసుకోవ‌చ్చో అన్నీ రాసాడు రాంజో. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఇచ్చిన ట్యూన్ కూడా అదిరిపోయింది. విజేత టీజ‌ర్ కాస్తో కూస్తో సినిమాపై ఆస‌క్తి పెంచింది. ఇక ఇప్పుడు కోడి పాట మ‌రింత ఆస‌క్తి పెంచేసింది. ఈ పాట‌తో సినిమాలో కామెడీకి కూడా ఢోకా లేద‌ని అర్థ‌మైపోయింది. కోడి పుణ్య‌మా అని క‌ళ్యాణ్ దేవ్ డాన్స్ కూడా చూసేస్తున్నారు అభిమానులు.

రాకేశ్ శ‌శి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్. జులైలో విజేత విడుద‌ల కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న ప‌దో హీరో ఈయ‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన స్టిల్స్ అయితే ప‌ర్లేద‌నిపించేలా ఉన్నాయి. ఇప్పుడు కోడిపాట బోన‌స్. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. రేపు సినిమా ఎలా ఉండ‌బోతుందో..? ఈ సినిమాను వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here