మెగా అల్లుడుగారు వ‌స్తున్నారు.. 

ఇండ‌స్ట్రీలో కొడుకుల‌తో పాటు అల్లుళ్ళ హ‌వా కూడా బాగానే న‌డుస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు త‌మ కూతుళ్ల‌ను ఇవ్వ‌డ‌మే కాదు.. అల్లుళ్ళ‌కు బూస్ట‌ప్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మ‌రో అల్లుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. అత‌డే మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ క‌నిగంటి. శ్రీ‌జ పెళ్లి అని అనౌన్స్ చేసిన‌పుడు.. అంతా ఆస‌క్తిగా ఎదురుచూసింది అల్లుడు ఎవ‌రు అని..? తీరా శ్రీ‌జ భ‌ర్త క‌ళ్యాణ్ ఫోటో బ‌య‌టికి వ‌చ్చిన‌పుడు అరే కుర్రాడు భ‌లే ఉన్నాడే.. చిరంజీవి క‌త్తి లాంటి అల్లున్ని ప‌ట్టాడు అనుకున్నారంతా. క‌ళ్యాణ్ చూడ్డానికి నిజంగా హీరో మాదిరే ఉంటాడు. మ‌నకి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల‌తో పోలిస్తే క‌ళ్యాణ్ అంద‌గాడే. ఈ కుర్రాన్ని చూసిన‌పుడే హీరో అయిపోతాడేమో అని అనుమానాలు అంద‌ర్లోనూ క‌లిగాయి. అయితే పెళ్లి త‌ర్వాత కూడా అల్లుడిపై ఎలాంటి రూమ‌ర్లు రాక‌పోవ‌డంతో మ‌నోడు సినిమాల‌కు దూరంగా ఉంటాడేమో అనుకున్నారంతా.
అలాంటిదేం లేద‌ని.. క‌ళ్యాణ్ కూడా సినిమాల్లోకి వ‌స్తాడ‌నే విష‌యం క‌న్ఫ‌ర్మైపోయింది. తాజాగా ఈయ‌న తొలి సినిమాపై వివరాలు కూడా బ‌య‌టికి వ‌చ్చేసాయి. సాయికొర్ర‌పాటి నిర్మాణంలో క‌ళ్యాణ్ తొలి సినిమా చేయ‌బోతున్నాడు. జ‌త‌క‌లిసే ఫేమ్ రాకేష్ శ‌శి తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో అను ప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ను హీరోయిన్ గా తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే క‌ళ్యాణ్ సినిమాపై అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చేసింది. మెగా అల్లుడు అనే ఒక్క బ్రాండ్ చాలు.. క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి. ఇప్ప‌టికే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు.. ర‌జినీ అల్లుడు ధ‌నుష్.. లాంటి హీరోలు సెటిలైపోయారు. ఇక ఇప్పుడు మెగా అల్లుడు కూడా వ‌స్తున్నాడు. ఈ విష‌యంలో చిరంజీవి కూడా అల్లుడికే స‌పోర్ట్ గా ఉన్నాడు. ఎంతైనా చిన్న‌ల్లుడు క‌దా.. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. పైగా చిన్న కూతురు అంటే చిరంజీవికి మ‌హా ఇష్టం. ఆమె అడిగితే చిరు అస్స‌లు కాద‌న‌లేడు. మెగా అల్లుడి బాక్సాఫీస్ గిల్లుడు రేంజ్ లో ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here