మెగా అల్లుళ్లు వ‌స్తున్నార‌హో.. త‌ప్పుకోండి త‌ప్పుకోండి..!

kalyan kanuganti VISHNAV TEJ MEGA ALLULLU
ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ అంటే క్రికెట్ టీంకు స‌రిపోయేంత మంది హీరోలున్నారు. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోలు ఆ కుటుంబం నుంచి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే మెగా అల్లుడు సిద్ధ‌మ‌య్యాడు. ఇంత‌కీ ఎవ‌రా అల్లుడుగారు అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు మెగాస్టార్ చిన్న‌ల్లుడు గారు కూడా ఇండ‌స్ట్రీకి వ‌చ్చేస్తున్నార‌హో.. ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో హాట్ న్యూస్. కుర్రాన్ని చూసిన‌పుడే హీరో అవుతాడేమో అనే వార్త‌లొచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తున్నాడు క‌ళ్యాణ్. ఈయ‌న తొలి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ అంతా పూర్త‌యింది. సాయికొర్ర‌పాటి నిర్మాణంలో క‌ళ్యాణ్ తొలి సినిమా చేయ‌బోతున్నాడు. జ‌త‌క‌లిసే ఫేమ్ రాకేష్ శ‌శి తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మాళ‌విక న‌య్య‌ర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే క‌ళ్యాణ్ సినిమాపై అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చేసింది.
ఇక ఈయ‌న‌తో పాటు సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరో అవుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈయ‌న్ని కూడా సాయి కొర్రపాటే హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈయ‌న నిర్మాణంలోనే ఇప్పుడు ఇద్ద‌రు మెగా అల్లుళ్లు ఇండ‌స్ట్రీకి రానున్నారు. త్వ‌ర‌లోనే ఈయ‌న సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. మెగా అల్లుడు అనే ఒక్క బ్రాండ్ చాలు.. క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి. ఇప్ప‌టికే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు.. ర‌జినీ అల్లుడు ధ‌నుష్.. లాంటి హీరోలు సెటిలైపోయారు. ఇక ఇప్పుడు మెగా అల్లుడు కూడా వ‌స్తున్నాడు. ఈ విష‌యంలో చిరంజీవి కూడా అల్లుడికే స‌పోర్ట్ గా ఉన్నాడు. ఎంతైనా చిన్న‌ల్లుడు క‌దా.. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. పైగా చిన్న కూతురు అంటే చిరంజీవికి మ‌హా ఇష్టం. ఆమె అడిగితే చిరు అస్స‌లు కాద‌న‌లేడు. మెగా అల్లుడి బాక్సాఫీస్ గిల్లుడు రేంజ్ లో ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here