మేజిన్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ ప్రారంభం !!

రాకేందుమౌళి-కల్పిక జంటగా.. యువ ప్రతిభాశాలి హరీష్ కె.విని దర్శకుడిగా పరిచయం చేస్తూ..  మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై యువ నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్  ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం నవంబర్ 2న ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వి, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోగల కిషోర్ హౌస్ లో జరిగిన ప్రారంభోత్సవంలో హీరోహీరోయిన్స్ రాకేందుమౌళి-కల్పిక-కృష్ణ భగవాన్ లపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) క్లాప్ కొట్టగా.. ప్రముఖ యువ కథానాయకి సోనీ చరిష్టా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ గౌరవ దర్శకత్వం వహించారు. “మాకొక మంచి లాయర్ కావాలని చెబితే.. మీ పేరు చెప్పారని” హీరో హీరోయిన్స్ అంటే.. “అయితే మీకెవరో తప్పు చెప్పారు. నేను లాయర్ ని మాత్రమే. మంచి లాయర్ ని మాత్రం కాదు” అని కృష్ణ భగవాన్ చెప్పడాన్ని మొదటి షాట్ గా చిత్రీకరించారు.
Mazin movie makers production no-1 shooting started off
అనంతరం మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్, దర్శకులు హరీష్ కె.వి, హీరో రాకేందు మౌళి, హీరోయిన్ కల్పికలతో పాటు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న 30 ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, కళ్యాణ్ విట్టల (అర్జున్ రెడ్డి ఫేమ్) పాల్గొన్నారు. నెల్లూరు నేపథ్యంలో.. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే క్రైమ్ కామెడీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నామని, రెండు షెద్యూల్స్ లో పాటలతో పాటు షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. తనను, తన కథను నమ్మి తనను దర్శకుడిగా పరిచయం చేస్తున్న  నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ కి దర్శకుడు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర చాలా వైవిధ్యంగా ఉందని.. దర్శకుడిగా హరీష్ కి ఉజ్వల భవిష్యత్ ఉందని కచ్చితంగా చెప్పగలనని పృథ్వి పేర్కొనగా.. తన పాత్రను దర్శకుడు హరీష్ నేరేట్ చేసినప్పుడు..  స్వయంగా రచయితనయిన తాను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానని, నా కెరీర్ లో గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని కృష్ణ భగవాన్ అన్నారు. హీరోహీరోయిన్స్ రాకేందుమౌళి-కల్పిక కూడా దర్శకుడు హరీష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ రూపంలో టాలీవుడ్ కి మరో మంచి దర్శకుడు పరిచయమవుతున్నాడని అన్నారు. “అర్జున్ రెడ్డి” తర్వాత తాను చేస్తున్న చాల మంచి చిత్రమిదని కళ్యాణ్ విట్టపు అన్నారు.
తాగుబోతు రమేష్, నెల్లూరు సుదర్శన్, తీన్ మార్ హరీష్, మహేష్ విట్టా(ఫన్ బకెట్ ఫేమ్) ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటింగ్: వికాస్, పాటలు: రాకేందుమౌళి-వెన్నెలకంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నశిపూడి చక్రవర్తి, నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్, కథ-చిత్రానువాదం-సంభాషణలు-దర్శకత్వం: హరీష్ కె.వి !!