మ్యాడీ తెలుగును సీరియ‌స్ గా తీసుకున్నాడు..

అవును.. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇన్నాళ్లూ తెలుగును త‌ప్ప అన్ని ఇండ‌స్ట్రీల‌ను సీరియ‌స్ గా తీసుకున్న మాధ‌వ‌న్ ఇప్పుడు తెలుగులోనూ వ‌ర‌స సినిమాలు చేయాల‌ని ఫిక్స్ అయిపోయిన‌ట్లున్నాడు. అందుకే వ‌ర‌స‌గా ఈయ‌న సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఇక్క‌డ‌. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు మ్యాడీ. ఈయన పాత్ర సినిమాకు చాలా హెల్ప్ అవుతుంద‌ని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు.

పైగా స‌వ్య‌సాచిని తెలుగుతో పాటు త‌మిళ నాట కూడా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు చందూమొండేటి. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌తోనూ నైపూణ్యం చూపించేవాడు అని అర్థం. భార‌తంలో అర్జునుడికి మాత్ర‌మే ఈ టాలెంట్ ఉంది. అందుకే అత‌డిని స‌వ్య‌సాచి అంటారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ అని తెలుస్తోంది.

ప్రేమ‌మ్ లాంటి క్లాస్ సినిమా త‌ర్వాత చందూ-చైతూ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంతో పాటు శివ‌నిర్వాణ‌-నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ లో రాబోయే సినిమాలో కూడా మాధ‌వ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలే కాదు.. ఇప్పుడు కోన‌వెంకట్ కూడా మాధ‌వ‌న్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ హీరోకు క‌థ చెప్ప‌డం.. ఈయ‌న ఒప్పుకోవ‌డం కూడా పూర్త‌య్యాయ‌ని తెలుస్తుంది. మొత్తానికి స‌ఖి.. చెలి.. ర‌న్ లాంటి సినిమాల‌తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న మ్యాడీ.. ఇన్నేళ్ళ‌కు తెలుగులో నేరుగా సినిమాలు చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here