మ‌ళ్లీ పోలీస్ అవుతున్న రాజ‌శేఖ‌ర్..

గ‌రుడ‌వేగ సినిమాతో తాను ఇంకా ఉన్నానంటూ ప్రేక్ష‌కులకు గుర్తు చేసాడు రాజ‌శేఖ‌ర్. ఈ చిత్రం 8 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. ఇప్పుడు క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రావ‌ట్లేదు రాజ‌శేఖ‌ర్ సిన‌మాల‌కు. అలాంటిది ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వ‌రకు ర‌ప్పించింది. ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించిన గ‌రుడ‌వేగ‌తో రాజ‌శేఖ‌ర్ కెరీర్ కు మ‌ళ్లీ ఊపిరి వ‌చ్చింది.
ఇప్పుడు ఈయ‌న మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం త‌న లుక్ పై దృష్టిపెట్టిన రాజ‌శేఖ‌ర్.. త్వ‌ర‌లోనే అ.. సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈయ‌న త‌మ‌న్నాతో క్వీన్ ను రీమేక్ చేస్తున్నాడు. నీల‌కంఠ నుంచి క్వీన్ సినిమాను ఈ కుర్ర ద‌ర్శ‌కుడు సొంతం చేసుకున్నాడు.
అ.. సినిమా అంద‌రికీ అర్థం కాక‌పోయినా ఈ కుర్రాడికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ తో ఈయ‌న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య రాజ‌శేఖ‌ర్ కూడా త‌న త‌ర్వాతి సినిమా ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ఉంటుంద‌ని హింటిచ్చాడు. మొత్తానికి ఈ కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా వ‌స్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here