మ‌ళ్లీ సైలెంట్ అయిన త‌రుణ్..

TARUN-BHASKER
పెళ్లిచూపులుతో తారాజువ్వ‌లా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌రుణ్ భాస్క‌ర్.. ఈ మ‌ధ్యే ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వ‌చ్చాడు. అయితే తొలి సినిమా రేంజ్ లో రెండోది పేల‌లేదు. టాక్ బాగానే వ‌చ్చినా ఎందుకో కానీ ఈ న‌గ‌రం అస్స‌లు ఏ న‌గ‌ర ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌లేదు. ముఖ్యంగా కుర్రాళ్ల సినిమా అంటూ ప్ర‌చారం చేయ‌డంతో కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ తొలి రోజు నుంచే ఈ న‌గ‌రానికి ఏమైందికి క‌రువైంది. దాంతో క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమా నిర్మాత‌ల‌కు సేఫ్ ప్రాజెక్ట్ అనిపించినా కూడా ప్రేక్ష‌కుల దృష్టిలో మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది.
ఈ చిత్రం వ‌చ్చి నెల అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌డం మానేసాడు. ఇప్ప‌ట్లో బ‌య‌టికి వ‌చ్చేలా కూడా లేడు ఈ ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే కొత్త క‌థ‌తో మ‌ళ్లీ క‌లుస్తానంటున్నాడు. ఈ సారి యూత్ స‌బ్జెక్ కాకుండా కాస్త క‌మ‌ర్షియ‌ల్ సినిమాతోనే వ‌స్తునంటున్నాడు త‌రుణ్. అయితే స్టార్స్ తో మాత్రం సినిమాలు చేయ‌డం లేదు త‌రుణ్ భాస్క‌ర్. కావాలంటే మ‌ళ్లీ కొత్త వాళ్ల‌తోనే సినిమా చేస్తానంటున్నాడు. మ‌రి త‌రుణ్ భాస్క‌ర్ మూడో సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here