మ‌హేశ్ ఆశీర్వాదాలు అందుకున్నారా..?

Mahesh Babu

అదేంటి.. మ‌హేశ్ బాబు ఆశీర్వాదాలు ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న ఇదే చేస్తున్నాడు మ‌రి. విడుద‌లైన ప్ర‌తీ సినిమా చూసి త‌న అభిప్రాయాలు తెలుపుతున్నాడు. అంతేకాదు.. త‌న అభినంద‌న‌లు కూడా ఇస్తున్నాడు. రంగ‌స్థ‌లం కంటే ముందు నుంచి కూడా ప్ర‌తీ సినిమాపై ఓ క‌న్నేసాడు సూప‌ర్ స్టార్. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ న‌ట‌న‌ను ఆకాశానికి ఎత్తేసిన మ‌హేశ్.. ఆ త‌ర్వాత చాలా సినిమాల‌కు ఇలాగే చూసి త‌న ట్విట్ట‌ర్ లో రివ్యూ పోస్ట్ చేసాడు. మొన్న‌టికి మొన్న స‌మ్మోహ‌నం కూడా అదిరిపోయిందంటూ ట్వీట్ చేసాడు.

దాంతో మ‌హేశ్ అభినంద‌న అందు కుని యూనిట్ అంతా గాల్లో తేలిపోయింది. ఇక ఇప్పుడు విశాల్ అభిమ‌న్యుడు సైతం మ‌హేశ్ చూసాడు. ఈ చిత్రం అద్భుతంగా ఉంద‌ని.. స్క్రీన్ ప్లే సూప‌ర్ గా ఉంద‌ని.. ఇలాంటి సినిమా తీసినందుకు.. చేసినందుకు ద‌ర్శ‌కుడు మిత్ర‌న్.. హీరో విశాల్ కు మ‌న‌సారా థ్యాంక్స్ చెప్పాడు మ‌హేశ్. డిజిట‌ల్ మీడియా గురించి అవ‌గాహ‌న ఉండేలా చేసిన ఈ చిత్రం త‌మిళ్ తో పాటు తెలుగులోనూ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌హేశ్ కూడా ఈ చిత్రాన్ని చూసి అభినందించాడు.

ప్ర‌స్తుతం ఈయ‌న డెహ్రాడూన్ లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర షూటింగ్ లో ఉన్నాడు. మ‌రో వారం రోజుల పాటు అక్క‌డే ఉండ‌బోతున్నాడు మ‌హేశ్. దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి అటు సినిమాతో బిజీగా ఉంటూనే.. ఇటు మ‌ధ్య‌మ‌ధ్య‌లో సినిమాలు చూసి త‌న అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాడు మ‌హేశ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here