మ‌హేశ్ కు షాక్ ఇచ్చిన మోడీ..


అవునా.. మ‌హేశ్ తో న‌రేంద్ర మోడికి ఏంటి సంబంధం..? ఈ ఇద్ద‌రికి ఎక్క‌డ లింక్ కుదిరింది అనుకుంటున్నారా..? మ‌రి అదే క‌దా బ‌ట‌ర్ ప్లై ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు మ‌హేశ్ సినిమాపై కూడా ఇదే జ‌రిగింది. ఈ నేచ‌ర్ లో ఎక్క‌డో జ‌రిగే ఓ చిన్న ఇన్సిడెంట్ ఇంకెక్క‌డో జ‌రిగే వాటిపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని సుకుమార్ చెప్పాడు క‌దా..! ఇప్పుడు మ‌హేశ్ సినిమాపై ఇదే జ‌రిగింది. కొన్ని రోజుల నుంచి డెహ్రాడూన్ లో వంశీ పైడిప‌ల్లి షూట్ లో బిజీగా ఉన్నాడు మ‌హేశ్. అక్క‌డే రెండు నెల‌ల షెడ్యూల్ ప్లాన్ చేసాడు వంశీ. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ కూడా అయిపోయాయి.
కానీ స‌డ‌న్ గా ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు నెల రోజులు ఆగిపోయింది. దానికి కార‌ణం న‌రేంద్ర‌మోడి. ఈ మ‌ధ్యే యోగా ఇంట‌ర్నేష‌న‌ల్ డే సంద‌ర్భంగా అక్క‌డికి వ‌చ్చెళ్లాడు మోడీ. డెహ్రాడూన్ లోనే యోగా డే సెలెబ్రేష‌న్స్ చేయాల‌ని చూస్తున్నాడు మోడీ. దాంతో మ‌హేశ్ షూటింగ్ జ‌రుగుతున్న ప్రాంతాన్ని నెల రోజుల పాటు పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు. అక్క‌డ షూటింగ్ ఏమీ చేయ‌కూడ‌ద‌నేది ఆర్డ‌ర్.
దాంతో అనుకోకుండా మ‌హేశ్ సినిమా ఆగిపోయింది. దాంతో చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ కు వ‌చ్చేసారు. మ‌ళ్లీ నెల రోజుల త‌ర్వాత షెడ్యూల్ మొద‌లు కానుంది. అయితే ఈ నెల రోజుల్లో మ‌రేదైనా కొత్త షెడ్యూల్ వంశీ ప్లాన్ చేస్తాడా లేదా అనేది చూడాలి. అప్ప‌టి వ‌ర‌కు అయితే మ‌హేశ్ కు హాలీడేస్ దొరికిన‌ట్లే. ఈ బ్రేక్ తో మ‌హేశ్ సినిమా సంక్రాంతి నుంచి స‌మ్మ‌ర్ కు వెళ్లిపోయింది. మొత్తానికి ఇలా మోడీ సాబ్ మ‌హేశ్ కు షాక్ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here