మ‌హేశ్ మొద‌లుపెట్టాడుగా..!

ఇప్పుడు అప్పుడు అనుకుంటున్న షూటింగ్ మొద‌లైంది. మ‌హేశ్ బాబు కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది. తొలి షాట్ తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ముందు నుంచి చెబుతున్న‌ట్లే ఉత్త‌రాఖండ్ లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. ఇప్ప‌టికీ స‌మ్మ‌ర్ హీట్ త‌గ్గ‌కపోవ‌డంతో అక్క‌డే తొలి షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు వంశీ. ఈ చిత్రంలో మ‌హేశ్ కొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ ను క‌లిసాడు సూప‌ర్ స్టార్. షూటింగ్ అక్క‌డే జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న్ని క‌ల‌వ‌డానికి ముఖ్య‌మంత్రి వ‌చ్చారు. ఆయ‌న్ని క‌లిసి ఫోటోల‌కు పోజిచ్చాడు సూప‌ర్ స్టార్. 10 రోజుల పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గనుంది. పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. డిసెంబ‌ర్ లోపు షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లాన్. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here