యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న “హ్యాపి వెడ్డింగ్”

ఇటీవ‌లే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క తో భాగ‌మ‌తి లాంటి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించిన‌  యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా “హ్యాపి వెడ్డింగ్” యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు.  ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహ‌రిక మెట్ట‌మెద‌టి సారి సుమంత్ అశ్విన్ తో నరిస్తుండడం విశేషం. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే చ‌క్క‌టి క‌థ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి ఫిదా లాంటి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ కి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు. స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుద‌ల చేస్తారు.
ఈ సంద‌ర్భంగా  నిర్మాత‌లు మాట్లాడుతూ..  తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న‌ క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో 2018 లో భాగ‌మ‌తి తో సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించారు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ తో మేము అసోసియేట్ అయ్యి “హ్యాపి వెడ్డింగ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక జంట‌గా న‌టిస్తున్నారు.  ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బ‌స్ట‌ర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని  పొస్ట్‌ప్రోడ‌క్ష‌న్ లో బిజిగా వుంది. ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌కుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కూ మధ్యలో రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా మా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం జ‌రిగివుంటుంది. ప్ర‌తిప్రేక్ష‌కుడ్ని ఈ పాత్ర‌లో త‌మ‌నితాము చూసుకునేలా పాత్ర‌ల్లో ప్రేక్ష‌కులు లీన‌మ‌య్యేలా ప్ర‌తి పాత్ర రూపొందిన చిత్రమిది. ఈ స‌మ్మ‌ర్ కి పెర్‌ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. త్వరలో నే టీజర్ ని రిలీజ్ చేస్తాము. సమ్మర్ కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు..
న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..
సాంకేతిక నిపుణులు..
యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
కెమెరా – బాల్ రెడ్డి
మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ – పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here