యు ట‌ర్న్ ఫ‌స్ట్ లుక్.. స‌మంత అదుర్స్..!

Samantha U Turn
పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల‌లో మార్పు వ‌స్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. చైతూతో పెళ్లి త‌ర్వాత స‌మంత సినిమాల ఎంపిక‌లో చాలా మార్పు వ‌చ్చింది. గ్లామ‌ర్ షో చేస్తూనే.. మ‌రోవైపు గుర్తుండిపోయే పాత్ర‌ల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాగూ పెళ్లైన త‌ర్వాత గ్లామ‌ర్ పండించే హీరోయిన్ అవ‌కాశాలు రావ‌ని స‌మంత‌కు తెలుసు. అందుకే విభిన్న‌మైన పాత్ర‌ల వైపు వెళ్తుంది.
అలా ఎంచుకున్న క‌థే యు ట‌ర్న్ సినిమా. క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ రీమేక్ లో న‌టిస్తుంది ఈ భామ‌. ఒరిజిన‌ల్ ను తెర‌కెక్కించిన ప‌వ‌న్ కుమార్ ఇక్క‌డ కూడా ద‌ర్శ‌కుడు.
తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. రోడ్ సైడ్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తోన్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ లోనూ స‌మంత సీరియ‌స్ ఫేస్ తో అదుర్స్ అనిపించింది. ఎందుకో తెలియ‌దు కానీ ముందు నుంచి కూడా ఈ చిత్రంపై చాలా ఆస‌క్తితో ఉంది స‌మంత‌. యుట‌ర్న్ రీమేక్ మ‌రో హీరోయిన్ తో చేయాల‌నుకున్నా కూడా ఆపి మ‌రీ తానే ఈ చిత్రంలో న‌టిస్తుంది.
దానికోసం ఒప్పుకున్న సినిమాలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసింది స‌మంత‌. 2016లో క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. అప్ప‌ట్లో చైతూతో క‌లిసి బెంగ‌ళూర్ వెళ్లి ప్ర‌త్యేకంగా ఓ షో చూసి వ‌చ్చింది ఈ భామ‌. ఇక ఇప్పుడు యు ట‌ర్న్ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు మార్చి మ‌న ద‌గ్గ‌రికి తీసుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆది ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తు న్నాడు. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here