రంగ‌మ్మ‌త్త.. చీర‌లోనే అందమంత ఉన్నది..!

ఇప్పుడు రంగ‌స్థ‌లం థ్యాంక్స్ మీట్ లో అన‌సూయ‌ను చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా ముందు అనాల‌నిపించే మాట ఇదే. అమ్మాయిగారు అత్త పాత్ర లోంచి త్వ‌ర‌గానే బ‌య‌ట‌ప‌డ్డారు. అన‌సూయ అంటే ఇన్నాళ్లూ మ‌న‌కు గుర్తొచ్చే ఇమేజ్ వేరు. ఈమె.. అందాల ఆర‌బోత‌.. యాంక‌రింగ్.. ఇలా ఏంటేంటో గుర్తొచ్చేవి. కానీ సుకుమార్ మాత్రం అన‌సూయ‌లో మ‌రో యాంగిల్ చూసాడు. ఇదే ఇప్పుడు రంగ‌స్థ‌లంలో క‌నిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌టిగా ఓ ర‌కం ఇమేజ్ ను మాత్ర‌మే సొంతం చేసుకున్న అన‌సూయ‌కు ఇప్పుడు రంగ‌స్థ‌లం మ‌రో ఇమేజ్ తెచ్చింది. రంగ‌మ్మ‌త్తగా ర‌ప్ఫాడించింది. ఈ పాత్ర అన‌సూయ కెరీర్ నే మార్చేస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. రంగ‌మ్మ‌త్త పాత్ర‌లోంచి త్వ‌ర‌గానే బ‌య‌టికి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా జ‌రిగిన థ్యాంక్స్ మీట్ లో మ‌ళ్లీ అదిరిపోయే అందాల షో చేసింది అన‌సూయ‌. ముందుగా ద‌ర్శ‌కుడు సుకుమార్.. హీరో చ‌ర‌ణ్ కు తాను సారీ చెప్పింది. ఈ పాత్ర ముందుగా అడిగిన‌పుడు త‌ప్పుగా అనుకున్నాన‌ని.. కానీ ఇప్పుడు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసిన త‌ర్వాత త‌న‌కు ఇంత పేరు రావ‌డానికి మీరే కార‌ణ‌మంటూ మ‌న‌సారా థ్యాంక్యూ చెప్పింది అన‌సూయ‌. ఈ వేడుక‌కు అత్త‌గా కాదు.. అచ్చం హీరోయిన్ లా రెడీ అయి వ‌చ్చింది ఈ భామ‌. బ్యాక్ లెస్ అందా ల‌తో కాక పుట్టించింది. చీర క‌ట్టిన‌ట్లే క‌ట్టింది కానీ అందాల‌న్నీ బాగానే చూపించింది. స్టేజ్ పై అను త‌ప్ప మ‌రో భామే లేక‌పోవ‌డంతో ఫంక్ష‌న్ అంతా అన‌సూయ అందాలే హైలైట్ అయ్యాయి. మొత్తానికి చూడాలిక‌.. రంగ‌స్థ‌లం ఇచ్చిన బూస్ట‌ప్ తో అన‌సూయ త‌న కెరీర్ ను ఎలా డిజైన్ చేసుకుంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here