రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్ అల్లుడు..

Allu Ayaan
అవును.. నిజంగానే రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్ అల్లుడు ఉన్నాడు. ఇంత‌కీ ఎవ‌రా అల్లుడు అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు అల్లుఅర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్. అచ్చంగా మామ‌ను దించేసాడు ఈ అల్లుడు. చ‌ర‌ణ్ మాదిరే లుంగీ క‌ట్టుకుని.. రుమాల్ ప‌ట్టుకుని ర‌చ్చ ర‌చ్చ చేసాడు అల్లుఅయాన్ ఈ గెట‌ప్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ఇందులో మ‌రో కోణం కూడా క‌నిపిస్తుంది. అల్లుఅర్జున్ కు, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య దూరం పెరిగింద‌ని ఈ మ‌ధ్య దూరం పెరిగింద‌ని వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌స్థ‌లంపై అల్లుఅర్జున్ ఒక్క‌టంటే ఒక్క ట్వీట్ కూడా వేయ‌లేదు. అంత బిజీగా ఉన్నాడా.. క‌నీసం బామ్మ‌ర్ది సినిమాను ప‌ట్టించుకునేంత టైమ్ కూడా బ‌న్నీకి లేదా అంటూ బాగానే సెటైర్లు పేలుతున్నాయి. ఇలాంటి టైమ్ లో అల్లుఅర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ రంగ‌స్థ‌లం గెట‌ప్ లో క‌నిపించే స‌రికి అంద‌రికీ మ‌బ్బులు విడిపోయాయి ఉన్న‌ట్లుండి త‌న‌యున్ని ఇలా సిద్ధం చేయ‌డంతో తాను ఇంకా మెగా ఫ్యామిలీ హీరోనే.. చ‌ర‌ణ్ తో త‌న‌కు ఇంకా పాత రిలేష‌నే ఉంద‌ని చెప్ప‌క‌నే త‌న‌యుడి గెట‌ప్ తో చెప్పాడు అల్లుఅర్జున్. మెగా హీరోల మ‌ధ్య ఉన్న రిలేష‌న్ కు ఇది నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తుంది. చూసారుగా.. ఇక్క‌డ కూడా త‌న మాస్టర్ బ్రెయిన్ వాడేసాడు అల్లుఅర్జున్. మొత్తానికి బావాబామ్మ‌ర్దుల బంధాన్ని అల్లుడు ప్ర‌పంచానికి చూపించాడ‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here