రాక్ బ్యాండ్ తో అల‌రించిన “ఉందా లేదా ” చిత్ర యూనిట్

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ఉందా.. లేదా?’. పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ రెండో వారంలో రిలీజ్ చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది ..ప్రోమోష‌న్ లో బాగంగా చిత్ర‌యూనిట్ కూక‌ట్ ప‌ల్లి మంజీర్ మాల్ లో Judeson and Scammers Team ఆధ్వ‌ర్యంలో రాక్ బ్యాండ్ ను నిర్వ‌హించింది..ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌కుడు శివప్ర‌సాద్ మాట్లాడుతూ .. ఉందా లేదా చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్దంగా ఉందని. చిత్రాన్ని డిసెంబ‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు..ప్రోమోష‌న్ లో బాగంగా కూక‌ట్ ప‌ల్లి మంజీర మాల్ లో రాక్ బ్యాండ్,ఫా్ష్ మ‌బ్ నిర్వహించామ‌న్నారు…ఉహించిన దానికంటే ఆడియో సాంగ్స్ కి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని ..మూవీ కూడా ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని..ప్రేక్ష‌క దేవుళ్ళు ఆద‌రించాల‌ని కోరారు..

హీరో రామ‌కృష్ణ మాట్లాడుతూ … ఉందా లేదా సాంగ్స్ కు మంజీరా మాల్ లో వ‌చ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందం క‌లిగింది.. ఇక్క‌డికి వ‌చ్చిన వారు ఎంజాయ్ చేస్తుంటే చాలా థ్రిల్లింగా అన్పించింద‌ని అన్నారు..మా చిత్రంలో సాంగ్స్ పాడి , ఆడి అల‌రించినందుకు Judeson and Scammers Team కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..

న‌టీన‌టులు: రామ‌కృష్ణ, అంకిత, కుమార్ సాయి, జీవా, రామ్‌‌జ‌గ‌న్, ఝాన్సీ, ప్రభావ‌తి, బ్యాన‌ర్: జ‌య‌క‌మ‌ల్ ఆర్ట్స్, ఎడిట‌ర్: మ‌ణికాంత్ తెల్లగూటి, కొరియోగ్రఫీ: నందు జెన్నా, పాట‌లు: నాగరాజు కువ్వార‌పు, శేషు మోహ‌న్, సింగ‌ర్స్: సింహ, హేమ‌చంద్ర, స్వీక‌ర్ అగ‌స్సీ, మ్యూజిక్: శ్రీముర‌ళీ కార్తికేయ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె బంగారి, స‌హానిర్మాత‌లు: అల్లం సుబ్రహ్మణ్యం, అల్లం నాగిశెట్టి, పి.ఆర్ .ఓ : ద‌య్యాల అశోక్ , నిర్మాత: అయితం ఎస్ క‌మ‌ల్, ద‌ర్శక‌త్వం: అమ‌నిగంటి వెంక‌ట శివప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here