రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్ తో ప్రారంభమైన రాయలసీమ లవ్ స్టోరీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త , రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్ తో ప్రారంభమైంది ” రాయలసీమ లవ్ స్టోరీ ”. కర్నూల్ లోని మౌర్యా ఇన్ హోటల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది .

హీరో వెంకట్ , హీరోయిన్ లు హృశాలి , పావని లపై టీజీ వెంకటేష్ క్లాప్ నివ్వగా నర్వా రాజశేఖర్ రెడ్డి స్విచాన్ చేసారు  , టీజీ వెంకటేష్ తనయుడు యువ నాయకుడు  టీజీ భరత్ ఫస్ట్ షాట్ కి  దర్శకత్వం వహించారు . అనంతరం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ” ఇన్నాళ్లు రాయలసీమ కథ లతో వచ్చిన సినిమాలన్నీ పగ , ప్రతీకారం అంటూ ఫ్యాక్షన్ ని మరింతగా రెచ్చగొట్టేలా సినిమాలు వచ్చాయి కానీ రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు నిండైన మనసున్న వాళ్ళు అని చాటి చెప్పడానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలను నేను అభినందిస్తున్నాను . ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చిత్ర పరిశ్రమకి చెందిన వాళ్ళు ఎవరైనా కర్నూల్ లో స్టూడియో లు కడతామని ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకరించడానికి మేమెప్పుడూ ముందుంటాం . పైగా అన్నిటికి అనువైన ప్రాంతం మా కర్నూల్ అంటూ దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు అందజేశాడు .

నిర్మాతలు నాగరాజు , హుస్సేన్ , ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ” రామ్ రణధీర్ చెప్పిన కథ మాకు నచ్చడంతో వెంటనే సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం , అలాగే రామ్ రణధీర్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం . టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరింత సంతోషంగా ఉందన్నారు .

దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ ” రాయలసీమ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి అయితే అవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు కానీ మా ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా విభిన్నమైన కోణంలో ఉంటుంది . ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం . ఈరోజు టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా మా సినిమా ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది . రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుండే జరుగుతుంది . కర్నూల్ నగరంలో పది రోజుల పాటు మొదటి షెద్యూల్ జరుగుతుంది . నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటాను , తప్పకుండా మా సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here