రాజ‌మౌళికి హీరోయిన్లు దొరికారోచ్..!

RRR Movieఇప్పుడు రాజ‌మౌళి సినిమా గురించి ఏది తెలిసినా ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మామూలుగా ఉండ‌దు. ఎందుకంటే ఈయ‌న సినిమా అంటే ఇప్పుడు ఇండియా అంతా పండ‌గే క‌దా. బాహుబ‌లి ప్ర‌భావం అలా ఉంది ఏం చేస్తాం మ‌రి..! ప్ర‌స్తుతం చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో మ‌ల్టీస్టార‌ర్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర క‌థ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు.
ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను క‌ల‌ప‌డం అంటే ఎంత క‌ష్ట‌మో రాజ‌మౌళికి తెలియంది కాదు.. అందుకే వాళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసేలా ఎక్క‌డా త‌గ్గ‌కుండా క‌థ సిద్ధం చేస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి ఆర్నెళ్లు దాటుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి సంబంధించిన ఒక్క న్యూస్ కూడా బ‌య‌టికి చెప్ప‌లేదు రాజ‌మౌళి. హీరోలు త‌ప్ప ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే విష‌యంపై స‌స్పెన్స్ త‌ప్ప‌డం లేదు. ఇందులో హీరోయిన్లుగా ఎవ‌రు న‌టించ‌బోతున్నార‌నే విష‌యంపై ఎన్నో చ‌ర్చ‌లు జ‌రుగు తూనే ఉన్నాయి.
ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. ఒక‌రు చ‌ర‌ణ్ కు.. మ‌రొక‌రు ఎన్టీఆర్ కు..! ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి క‌న్ను మ‌హాన‌టిపై ప‌డిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయిన ద‌ర్శ‌క‌ధీరుడు.. త‌న సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఈ భామ‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ర‌కుల్ ను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ముందు పూజాహెగ్డేను అనుకున్నా కూడా ఈమె ఉన్న బిజీకీ మ‌రో ఏడాది వ‌ర‌కు డేట్స్ స‌రిగ్గా ఉండ‌వు.
ఈమె ఒక్క‌రి వ‌ల్ల షూటింగ్ అప్ సెట్ అవ్వ‌డం రాజ‌మౌళికి ఇష్టం లేదు. అందుకే ఇప్ప‌టికే రెండు సినిమాల్లో క‌లిసి న‌టించిన చ‌ర‌ణ్, ర‌కుల్ జోడీని కొన‌సాగిస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. కీర‌వాణి సంగీతం అందించ‌నున్న ఈ చిత్రాన్ని దాన‌య్య 300 కోట్ల‌తో నిర్మించబోతున్నాడు. 2020లో సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here