రానా.. కంటి వెన‌క మ‌రో క‌థ‌..!

పైకి క‌నిపించేదంతా నిజం కాదు. ఆ క‌ళ్ల వెన‌క ఏదో క‌థ దాగి ఉంటుంది. రానా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఆర‌డుగుల ఆజానుబాహుడు.. సిక్స్ ప్యాక్ మ్యాచో లుక్ తో ఎప్ప‌టికిప్పుడు అదిరిపోయేలా క‌నిపించే రానా వెన‌క క‌న్నీటి గాధ ఉంది. ఈయ‌న‌కు ఓ క‌న్ను లేదు. కుడి కంటికి చిన్న‌పుడే ఓ గాయమై తీసేసారు. ఇప్పుడు రానా చూస్తున్న‌ది పెట్టుడు కంటితో. ఆయ‌న‌కు ఆ క‌న్ను క‌నిపించ‌దు కూడా.

అయితే ఇప్పుడు ఈ కంటికి చికిత్స చేయించుకుంటున్నాడు రానా. ఈ మ‌ధ్యే అమెరికా కూడా వెళ్లొచ్చాడు. అయితే ఈయ‌న‌కు బిపి ఉన్న కార‌ణంగా ఆప‌రేష‌న్ కోసం ఆల‌స్యం అవుతు వ‌స్తుంది. బిపి కుదురుకున్నాకే ఆప‌రేష‌న్ అని చెబుతున్నాడు రానా. అయితే మీడియాలో వ‌స్తున్న‌ట్లు త‌న‌కేం అనారోగ్యం లేద‌ని.. బానే ఉన్నాన‌ని అయితే ఆప‌రేష‌న్ కోసం మాత్రం కాస్త టైమ్ ప‌ట్టేలా ఉందంటున్నాడు రానా. ఇప్ప‌టికే ఈ ఆప‌రేష‌న్ కు సంబంధించిన ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి.

ఈ నెల‌లోనే అమెరికా వెళ్లి అక్క‌డే కొన్ని రోజులు ఉండి ఆప‌రేష‌న్ పూర్తి చేసుకుని రానున్నాడు రానా. ప్ర‌స్తుతం ఈయ‌న అర‌డ‌జ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అన్న‌ట్లు ఈ మ‌ధ్యే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నాడు రానా. బాహుబ‌లి 2లో ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ఈ అవార్డ్ తీసుకున్నాడు ద‌గ్గుపాటి వార‌సుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here