రాశీఖ‌న్నా.. ఇన్నాళ్ల‌కు కొట్టిందబ్బా..!

  
ముట్టుకుంటే మాసిపోయే అందం అంటాం క‌దా అలా ఉంటుంది రాశీఖ‌న్నా చూడ్డానికి. పైగా న‌ట‌న కూడా బాగానే ఉంటుంది. సుప్రీమ్ లాంటి సినిమాల్లో కామెడీ కూడా చేసింది రాశీ. కెరీర్ మొద‌లై ఇప్ప‌టికే ఐదేళ్లు అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోలేదు ఈ భామ‌. స్టార్ హీరోల‌తో న‌టించినా కూడా రాశీకి ఎందుకో కానీ స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. త‌న టైమ్ వ‌స్తుందిలే అని వేచి చూడ‌టం త‌ప్ప మ‌రేం చేయ‌లేక కామ్ గానే ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నాళ్ల‌కు ఆ టైమ్ వ‌చ్చేసింది. తొలిప్రేమ‌తో అమ్మాయిగారు కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ రానే వ‌చ్చింది. ఇక ఇందులో ఈమె వ‌ర్ష పాత్ర‌కు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.
వ‌రుణ్ తేజ్ తో ఈమె కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఇద్ద‌రూ లిప్ లాక్స్ లో చంపే స్తున్నారు. సినిమా మూడ్రోజుల్లోనే 15 కోట్ల షేర్ అందుకుని భారీ విజ‌యం వైపుగా అడుగేస్తుంది. ఇన్నాళ్లూ అందం ఉండి.. అందాన్ని ఆర‌బోసే గుణం ఉండి.. అద్భుత‌మైన అభిన‌యం ఉండి.. అదృష్ట‌మే లేక సెకండ్ హ్యాండ్ హీరోయిన్ గానే ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు రాశీఖ‌న్నాకు అస‌లు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. స్టార్స్ ఈమె వైపు చూస్తున్నారు. ఆ మ‌ధ్య జై ల‌వకుశ‌లో ఎన్టీఆర్ తో జోడీ క‌ట్టింది రాశీ. ప్ర‌స్తుతం మ‌రో రెండు మూడు సినిమాల‌కు సైన్ చేసింది ఈ భామ‌. మొత్తానికి హిట్టొచ్చింది క‌దా ఆ జోరు మ‌రో లెవ‌ల్లోనే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here