రాశీ అక్క‌డ ఎంజాయ్ చేస్తుందిగా..!

 


చేతిలో ఉన్న సినిమాలు అయిపోయాయి.. కొత్త అవ‌కాశాలు ఇంకా రాలేదు.. మ‌ధ్య‌లో ఖాళీ టైమ్ బాగానే దొరికేసింది. దాంతో దొరికిన టైమ్ ను చ‌క్క‌గా వాడుకుంటుంది రాశీఖ‌న్నా. ప్ర‌స్తుతం ఈ భామ చేతిలో ఉన్న‌ది ఒకే ఒక్క సినిమా.. అది కూడా నితిన్ తో చేస్తున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌. దాంతో అమ్మ‌డు నెద‌ర్లాండ్స్ లో ల్యాండ్ అయిపోయింది.
అక్క‌డ కొన్ని రోజులుగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ప్ర‌తీరోజు త‌ను చేస్తున్న ఎంజాయ్ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల‌కు కూడా థ్రిల్ ఇస్తుంది రాశీఖ‌న్నా. తెలుగులో తొలిప్రేమ లాంటి విజ‌యం త‌ర్వాత కూడా ఎందుకో కానీ ఈమెకు చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు అ యితే రావ‌డం లేదు. ఇప్పుడు కూడా శ్రీ‌నివాస క‌ళ్యాణం పూర్తి కావొస్తున్నా కూడా ఇప్ప‌టికీ మ‌రో ఆఫ‌ర్ రాలేదు. త‌మిళ్ లో కూడా సైతాన్ కి బ‌చ్చ సినిమాలో న‌టిస్తుంది. సిద్ధార్థ్ ఇందులో హీరో. మొత్తానికి ఈ రెండు సినిమాలు పూర్తైతే మ‌ళ్లీ ఆఫ‌ర్ల కోసం రాశీకి వేట త‌ప్ప‌దు. మ‌రి చూడాలిక‌.. ఈ భామ ఏం చేస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here