రాస్కోరా సాంబ అంటున్న నాగ‌శౌర్య‌..!

ఏదేమైనా ఇండ‌స్ట్రీలో హిట్ ఇచ్చే కిక్ ఇంకేదీ ఇవ్వ‌దు. ఇన్నాళ్లూ త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కు రావాలంటే కూడా అదోలా క‌నిపించే నాగ‌శౌర్య‌.. ఛ‌లో త‌ర్వాత ఎంత మారిపోయాడో చూడండి..? ఈయ‌న్ని చూస్తుంటే నిజంగా ఆ హీరో ఇత‌నేనా అనే అనుమానం వ‌స్తుంది.
ప్ర‌స్తుతం ఈయ‌న న‌ర్త‌న‌శాల సినిమాతో వ‌స్తున్నాడు. శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న సొంత బ్యాన‌ర్ లోనే ఈ చిత్రం చేస్తున్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రికి వ‌చ్చేసింది. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా విశేషాలు తెలిపాడు శౌర్య‌. పెద్ద‌గా ఏం చెప్ప‌లేదు కానీ ఒక్క‌మాట మాత్రం అనేసాడు. ఛ‌లో త‌ర్వాత వ‌స్తుంది క‌దా.. ఇది కూడా రాసిపెట్టుకోండి అంటూ ధైర్యంగా చెప్పేస్తున్నాడు. ఒక్క‌సారి గెలుపు రుచికి అల‌వాటు ప‌డిన త‌ర్వాత వెన‌క్కి రావ‌డం క‌ష్టం.
ఇన్నాళ్లూ నాగ‌శౌర్య‌కు అది ఎలా ఉంటుందో పెద్ద‌గా తెలియ‌దు. వ‌చ్చిన స‌క్సెస్ లు కూడా అర‌కొర‌గానే వ‌చ్చాయి. ఈ మ‌ధ్యే ఛ‌లోతో నిఖార్సైన విజ‌యం అందుకున్నాడు నాగ‌శౌర్య‌. అది కూడా సొంత బ్యాన‌ర్ లోనే. ఐరా సంస్థ అంటూ ఒక‌టి క్రియేట్ చేసి.. అందులోనే సినిమా చేసాడు శౌర్య‌. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. మంచి లాభాలు తీసుకొచ్చింది.
బ‌య‌టి బ్యాన‌ర్స్ లో చేయ‌డం వ‌ల్ల త‌న సినిమాలు స‌రైన ప్ర‌మోష‌న్ లేక పోయాయంటున్నాడు శౌర్య‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన జాదూగాడు.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలు పోవ‌డానికి కార‌ణాలు స‌రైన టైమ్ లో రిలీజ్ కాక‌పోవ‌డ‌మే అంటున్నాడు శౌర్య‌. అందుకే సొంతబ్యాన‌ర్ లోనే వ‌ర‌స‌ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి మ‌రి ఛ‌లోతో వ‌చ్చిన స‌క్సెస్ ను నర్త‌న‌శాల‌తో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here