రితికా.. ఏం పిల్ల‌గురు.. అన్నీ అవార్డులే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ప‌ట్లో స‌ర్దార్ సినిమాలో ఓ డైలాగ్ చెప్పాడు. పేరు గుర్తుందిగా.. స‌ర్దార్.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అంటూ ప‌వ‌ర్ స్టార్ చెప్పిన తీరు ఎవ‌రు మాత్రం మ‌రిచిపోగ‌ల‌రు. సినిమా ఫ్లాప్ అయినా ఆ డైలాగ్ అలా ఉండిపోయింది. ఇప్పుడు రితికా సింగ్ కూడా తొలి సినిమాతోనే అంద‌రికీ త‌న పేరు గుర్తు పెట్టుకోండ‌ని వార్నింగ్ ఇచ్చేసింది. తొలి సినిమాతోనే త‌న న‌ట‌న‌తో ఈ త‌రం హీరోయిన్లంద‌రికీ స‌వాల్ చేసింది.

సాలాఖ‌డూస్ తో ప‌రిచ‌యం అయిన‌ ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డ్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే సినిమా రీమేక్ గురుతో ఇక్క‌డ కూడా అవార్డుల పంట పండించుకుంది. ఈ చిత్రానికి గానూ ఉత్త‌మ న‌టిగా క్రిటిక్స్ నుంచి అవార్డు అందుకుంది రితికా.

అంటే ఇక్క‌డ కూడా తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ ను అందుకుంది అన్న‌మాట‌. అన్న‌ట్లు త‌మిళ‌నాట కూడా సాలాఖ‌డూస్ త‌మిళ్ వ‌ర్ష‌న్ కు తొలి సినిమాతోనే అవార్డు అందుకుంది. ఇలా ప్ర‌తీ ఇండ‌స్ట్రీలో కూడా గురు సినిమాతో అవార్డుల‌న్నీ అందుకుంది రితికా సింగ్. ఇలాంటి రికార్డ్ బ‌హుశా ఒక్క ఈ బాక్సింగ్ పిల్ల‌కే ఉందేమో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here