ఇప్పుడు రెజీనా రెచ్చిపోయిన సాంగ్ చూసిన తర్వాత ఇది కాకుండా ఇంకేం అంటాం చెప్పండి. అసలు ఈ భామకు అదృష్టం లేదు కానీ ఈ పాటికే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోవాల్సి ఉండేది. ఎందుకో తెలియదు కానీ మొదట్నుంచీ రెజీనాపై పెద్ద హీరోలు చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. లేకపోతే మరేంటి ఆమె కంటే తర్వాత వచ్చిన వాళ్లు కూడా స్టార్స్ అయిపోయారు కానీ రెజీనా ఇప్పటికీ అలాగే ఉంది. అంతెందుకు ఆమె ప్రాణ స్నేహితురాలు రకుల్ నెంబర్ వన్ కూడా అయింది. కానీ రెజీనా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
ఈ రోజుకు కూడా స్టార్ అవ్వాలని ఆరాటపడుతూనే ఉంది కానీ కాలేదు.. కావట్లేదు.. అవుతుందో లేదో క్లారిటీ లేదు. అందం ఉంది.. అభినయం ఉంది కానీ అదృష్టమే లేక అక్కడే ఆగిపోయింది రెజీనా. పోనీ గ్లామర్ షో ఏమైనా తక్కువగా చేస్తుందా అంటే అదీ లేదు. తాజాగా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ సినిమా కోసం అమ్మడు రెచ్చిపోయిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా అందాలు ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ. బీచ్ లో అమ్మాయిగారు బికిని వేసుకుని చేసిన రచ్చ ఓ రేంజ్ లో ఉంది.
ఇప్పుడు ఈ చిత్రంలోని ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. మునిగిపోతున్న కెరీర్ నావను ఒడ్డుకు చేర్చుకోడానికి అవసరమైన ప్రతీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ గ్లామర్ షో అయినా రెజీనా కెరీర్ ను దారికి తీసుకొస్తుందో లేదో చూడాలి..!