బిగ్ బాస్ కు తెలుగు ప్రేక్షకులు బాగానే అలవాటు పడిపోయారు. ఎన్టీఆర్ లేకపోయినా నాని ఉన్నా కూడా ఈ సారి కూడా ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ రేంజ్ లో మాత్రం కాదు. తొలివారం రేటింగ్స్ వచ్చేసాయి. బిగ్ బాస్ మొదలైన తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చిన రేటింగ్స్ లో 9.22 టీఆర్పీతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అయితే అది నాని వచ్చిన ఎపిసోడ్ మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మామూలుగానే వచ్చింది ఈ సీజన్.
తొలి వారం పర్లేదనే స్థాయిలోనే ఉంది కానీ సూపర్ అని మాత్రం లేదు. ముందు ఈ సీజన్ పై బాగానే విమర్శలు వచ్చినా ఇప్పుడు మాత్రం కూల్ గా అలా వెళ్లిపోతుంది. తొలి సీజన్ తో పోలిస్తే ఈ సారి పెద్ద బిస్కెట్ అయిపోయింది. అసలు ఎవరూ తెలిసిన మొహాలు లేరు. ఇలాంటి వాళ్లతో షో ఎలా రన్ చేస్తారు అంటూ బాగానే విమర్శలు వచ్చాయి. ఇలాంటి వాళ్ళతో నాని ఎలా వేగుతాడో ఏంటో అనే వార్తలు బాగానే వినిపించాయి.
కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా సెట్ అయినట్లే కనిపిస్తుంది. ఈ షో పై రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది. తెలియని మొహాలు ఉన్నా కూడా కొత్త కొత్త టాస్క్ లు ఇస్తూ షోపై ఇంట్రెస్ట్ పెంచేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పర్లేదనే స్థాయిలోనే ఉంది. అయితే నాని వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్ లలోనే నాని కనిపించాడు. మొత్తానికి చూడాలిక.. ఎండ్ వరకు ఎలా ఉంటుందో ఈ కథ..!