రేణును కావాల‌నే స‌తాయిస్తున్నారా..?

ఇన్నాళ్లూ వినిపించ‌ని పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఉన్న‌ట్లుండి కొన్ని రోజులుగా రేణుదేశాయ్ టాప్ న్యూస్ అయిపోయింది. ఈమె రెండో పెళ్లి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిపోయింది. ఈ పెళ్లికి ప‌వ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం కాదు.. ఆల్ ది బెస్ట్ అంటూ త‌న సంతోషాన్ని మాజీ భార్య‌కు చెప్పాడు కూడా. ఇదిలా ఉంటే దుంప‌కు లేని క‌త్తికి ఎందుకు అన్న‌ట్లు.. ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు కొంద‌రు కావాల‌నే రేణుదేశాయ్ ను ట్విట్ట‌ర్ లో.. ఇన్ స్టాగ్రామ్ ల‌లో రెచ్చ‌గొడుతున్నారు.

ఎంగేజ్ మెంట్ త‌ర్వాత ట్విట్ట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఈమెను ఇన్ స్టాలో టార్గెట్ చేసారు. దాంతో స‌హ‌నం కోల్పోయిన రేణు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. తాను నోరు విప్పితే మీ అంద‌రి త‌ల‌లు ఎక్క‌డ పెట్టుకుంటార‌ని వార్నింగ్ ఇచ్చే సింది. విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన ఫ్యాన్స్ అల్లాడిపోతారు.. వ‌ణికిపోతారంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అప్ప‌ట్లో ఈమె విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు రేణు మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఇదే నిజం అని క‌న్ఫ‌ర్మ్ అవుతుంది. ఇక ఫ్యాన్స్ ను కూడా అంద‌ర్నీ అన‌లేదు రేణు. పవన్ అభిమానుల్లో చాలా మంది మర్యాదస్తులు.. మంచివాళ్లు ఉన్నప్పటికీ.. కొంద‌రు మూర్ఖులు కూడా ఉన్నార‌ని చెప్పింది రేణుదేశాయ్. చేయ‌ని త‌ప్పుకు తన‌ను టార్గెట్ చేస్తుంటే వాళ్ల పిచ్చి చేష్ట‌ల‌ను తానెందుకు భ‌రించాలంటుంది రేణు. తాను కానీ నోరు తెరిస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్ కు తిప్ప‌లు త‌ప్ప‌వంటుంది. ఇలాంటి వార్నింగ్ వ‌చ్చిన త‌ర్వాతైనా అభిమానులు ఊరుకుంటారో లేదో మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here